
అయితే ఇలా డిఫరెంట్ కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ‘కుశ’ పాత్ర స్వరూపం ఏమిటి? ఒకటి ‘జై’గా నెగటివ్ టచ్ ఇవ్వనుండగా, మరొకటి ‘లవ’గా మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న టచ్ ఇచ్చారు. ఇక మిగిలిన మూడో పాత్ర ఎలా ప్రవర్తిస్తాడు? అన్న ఆసక్తికి ఈ పోస్టర్ల ద్వారా చిత్ర యూనిట్ ఓ హింట్ ఇవ్వనే ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ నిల్చుని సీరియస్ గా చూస్తున్న పోస్టర్లో… తారక్ తో పాటు కరెన్సీ నోట్లు కూడా కనపడుతున్నాయి. అంటే డబ్బు కోసం ఏదైనా చేసే పాత్రలో ‘కుశ’ కనిపించబోతున్నాడనే సంకేతాలను ఇస్తోంది.
అంటే ‘జై’లో కొంత నెగటివ్ ని, ‘లవ’లోని కొంత పాజిటివ్ ను కలిపి, ‘కుశ’గా దర్శకుడు బాబీ రూపకల్పన చేసారా? ఈ ప్రశ్నకు సమాధానం అతి త్వరలోనే తెలియనుంది. ఇంకా సినిమా విడుదలకు నెల రోజులు కూడా లేకపోవడంతో, ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోవాల్సి ఉన్న నేపధ్యంలో… ‘కుశ’ టీజర్ ను ఎక్కువ ఆలస్యం చేయకుండానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మూడు గెటప్స్ లో కనిపిస్తున్న తారక్, గడ్డం విషయంలో మాత్రం దాదాపుగా ముగ్గురిది ఒకే విధంగా అగుపడుతోంది.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…