
చిత్రం: జైలర్ 2
M9 రేటింగ్: 2.5/5
విడుదల తేదీ: అక్టోబర్ 15, 2026
తారాగణం: రజనీకాంత్, ఎస్.జే.సూర్య, రమ్యకృష్ణ, విద్యాబాలన్, సురాజ్, యోగిబాబు, నమో నారాయణ తదితరులు
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: సన్ పిక్చర్స్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్
కూర్పు: ఆర్.నిర్మల్
2023లో విడుదలైన జైలర్ ఒక ప్రభంజనం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ ని తీసారు నెల్సన్ & రజనీకాంత్. ఈసారి కూడా సీక్వెల్ మీద పెద్దగా అంచనాలు లేవు. అందుకు కారణాలు కోకొల్లలు అయినప్పటికీ.. రజనీకాంత్ మీద నమ్మకంతోనే థియేటర్లకి వచ్చారు జనం. మరి రజనీ-నెల్సన్ ఆడియన్స్ ని మెప్పించగలిగారా? లేదా? అనేది చూద్దాం..!!
కథ:
టైగర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) తన మనవడు, కోడలు, భార్యతో కలిసి ఓ గ్రామంలో సాధారణ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే.. వర్మని చంపడంతో ముత్తు కోసం చాలా గ్యాంగులు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్యాంగుల నుండి తప్పించుకుంటూ, ఆ గ్యాంగులన్నీటికీ లీడర్ అయిన బోధి కల్పక్ (ఎస్.జే.సూర్య)ని రీచవ్వడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు ముత్తు.
ఈ ముసుగులో గుద్దులాటకి తెరపడి.. ఈ గ్యాంగులన్నిటికీ ముత్తు ఎలా సమాధానం చెప్పాడు? అనేది “జైలర్ 2” కథాంశం.
నటీనటుల పనితీరు:
రజనీకాంత్ జైలర్ లో ఫాలో అయిన పద్ధతినే సీక్వెల్ లోనూ రీక్రియేట్ చేశారు. కనీసం ఒక్క పవర్ ఫుల్ డైలాగ్ లేదా ఫైట్ చేయకుండానే మాస్ మేనియాను పండించారు. ఆ కళ్లజోడు తీసి పెట్టుకునే విధానం, బూట్లకి లేస్ కట్టుకునే తీరు, స్లోమోషన్ లో నడుచుకుంటూ వచ్చే స్టైల్ చాలు ఫ్యాన్స్ కుష్ అవ్వడానికి. రజనీ అదే చేసారు, సినిమా మొత్తంలో ఆయన చెప్పే డైలాగులు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అయితే.. తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
ఎందుకో మొదటి భాగంలో వర్కవుట్ అయినట్లుగా సీక్వెల్ లో క్యామియోలు వర్కవుట్ అవ్వలేదు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి నటులతోపాటు ఓ బాలీవుడ్ స్టార్ హీరో మరియు ఓ తమిళ స్టార్ హీరో కూడా కనిపించినప్పటికీ.. అవి ఇరికించినట్లుగానే ఉన్నాయి తప్పితే పెద్దగా ఎగ్జైట్ చేయలేదు.
యోగిబాబు, నమో నారాయణల కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. రమ్యకృష్ణ, మిర్నాల పాత్రలు మెలోడ్రామా పండించడానికి ప్రయత్నించారు కానీ.. ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. ఎస్.జే.సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తిల విలనిజం కూడా పండలేదు. అందువల్ల సినిమాలో ఒక స్ట్రాంగ్ కాన్ ఫ్లిక్ట్ పాయింట్ అనేది లేకుండాపోయింది.
సాంకేతికవర్గం పనితీరు:
ఒక సీనియర్ స్టార్ హీరోని ఎలా వాడుకోవాలి అనేది నెల్సన్ నుండి నేర్చుకోవాలి. రజనీతో కనీసం కాలు కదపనివ్వకుండా సినిమాని నడిపించాడు నెల్సన్. యాక్షన్ సీన్స్ & ఎలివేషన్స్ డీల్ చేసిన విధానం కూడా అదిరింది. అయితే.. ఫస్టాఫ్ ను హిలేరియస్ ఫన్ తో ఎంటర్టైనింగ్ గా నడిపిన నెల్సన్.. సెకండాఫ్ లో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా కొడుకు చనిపోవడాన్ని మెలోడ్రమెటిక్ గా వర్కవుట్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. అలాగే.. స్టార్ హీరోల క్యామియోలు కూడా కిక్ ఇవ్వలేదు. ఇక సెకండాఫ్ లో వచ్చే విలనిజం అనేది చాలా రొటీన్ గా ఉంటుంది, దాన్ని డీల్ తీరులోనూ నెల్సన్ మార్క్ కనిపించదు. అందువల్ల సెకండాఫ్ పెద్దగా ఎగ్జైట్ చేయదు. కాకపోతే.. రజనీకాంత్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో నెట్టుకొచ్చేశాడు నెల్సన్. సో, ఓ మోస్తరుగా అలరించగలిగాడు కానీ.. ఒక పూర్తిస్థాయి సంతృప్తినివ్వలేకపోయాడు.
అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా ఎలివేట్ చేశాడు కానీ.. ఆడియన్స్ కి గుర్తుండిపోయే స్థాయి మెమరబుల్ స్కోర్ మాత్రం ఇవ్వలేదు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ వర్క్, కలర్ గ్రేడింగ్, ప్రొడక్షన్ డిజైన్, సీజీ వర్క్ సినిమాని మెయిన్ ఎసెట్స్. ఇవన్నీ సమకూర్చిన సన్ పిక్చర్స్ సంస్థను కూడా మెచ్చుకోవాలి. క్వాలిటీ విషయంలో వాళ్ల స్టాండర్డ్స్ పీక్ లెవల్లో ఉంటున్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకు తప్పకుండా ప్రశంసార్హులు.
విశ్లేషణ:
రజనీ మేనియా ఎంజాయ్ చేయడం అనేది ఆడియన్స్ కి ఒక సెలబ్రేషన్. అయితే.. ఆ సెలబ్రేషన్ ఆర్గానిక్ గా వర్కవుట్ అవ్వాలి కానీ, బలవంతంగా ఉండకూడదు. జైలర్ 2 విషయంలో జరిగింది అదే. సెకండాఫ్ లో వచ్చే విలనిజం, విలన్స్ గ్యాంగ్ & సెటప్ సినిమాకి సింక్ అవ్వలేదు. అందువల్ల ఫస్టాఫ్ లో అంతబాగా ఎంటర్టైన్ అయిన ఆడియన్స్ సెకండాఫ్ కి వచ్చేసరికి ఏదో తక్కువయ్యింది అనే ఫీలింగ్ లో ఉంటారు. అయితే.. ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్, మరీ ముఖ్యంగా యోగిబాబు, నమో నారాయణల కామెడీ బాగా వర్కవుట్ అవ్వదు, రజనీ మార్క్ ఎలివేషన్స్ సరిగ్గా ప్లేస్ అవ్వడంతో “జైలర్ 2” పూర్తిస్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుకుపైనే ఎంటర్టైన్ చేస్తుంది. అసలే ఈమధ్యకాలంలో ఈ రేంజ్ మాస్ ఎంటర్టైనర్స్ రాలేదు కాబట్టి థియేటర్లలో సినిమా సునాయాసంగా వర్కవుట్ అయిపోతుంది.
ఓవరాల్ గా.. సెకండాఫ్ సిండ్రోమ్ తో బాధపడ్డ జైలర్ సాబ్!
M9 రేటింగ్: 2.5/5
Personal struggles can sometimes affect professional relationships, even when someone tries to keep the two…
Actor Imran Khan is facing fresh controversy after taking part in a protest in Mumbai.…