
[m9ad]
ఈ కార్యక్రమం పాదయాత్రలా కాకుండా సైనికుల కవాతు రీతిలో సాగనుంది. ఇందులో పాల్గొనే వారిలో 10 వేల మంది ప్రత్యేక వస్త్రధారణతో పవన్ వెంట నడుస్తారు. మిగిలిన వారు వారిని అనుసరిస్తారు. తొలుత పిచ్చుకలంక నుంచి ప్రారంభమయ్యే కవాతు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు కొనసాగుతుంది.
కవాతులో వివిధ కులవృత్తుల వారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కవాతు నిర్వహణ, బహిరంగ సభ పర్యవేక్షణకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన 1,500 మందిని నియమించారు. వివిధ జిల్లాల నుండి వస్తున్న జనసైనికులకు వేరు వేరు ప్రాంతాలలో పార్కింగు ఏర్పాట్లు చేస్తున్నారు. వంతెనపై నడుస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గోదావరి నదిలోనూ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
The 2026 season of the Indian Premier League is raising a key question. Are teams…
Following the back to back failures of Deva and Retro, Pooja Hegde is now awaiting…