Telugu

పవన్ చేస్తోంది ఒంటరి పోరాటమే!

‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో చేస్తోంది ‘ఒంటరి పోరాటమేనని’ కమెడియన్ అలీ అన్నారు. పవర్ స్టార్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రతి సినిమాలోనూ పవన్ పక్కన నటించే అలీ, రాజకీయ రంగంలో ఎందుకు పవన్ పక్కన నిలబడలేదు? అన్న ప్రశ్న ఎదురైన సందర్భంలో చెప్పిన జవాబు ఇది. రాజకీయాల్లోకి అడుగుపెడితే, అప్పటివరకు పొగిడిన వాళ్ళే తిడతారని, అలాగే బెదిరింపులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ విషయం తెలిసిన పవన్ తన సన్నిహితులను ఎవరిని పిలవలేదని చెప్పారు.

ఏం జరిగినా… తాను ఒక్కడే పోరాడడానికి పవన్ నిర్ణయించుకున్నాడని, మంచైనా, చెడైనా అన్నీ తానే ఎదుర్కోవడానికి పవన్ సిద్ధమయ్యారని, ఏదైనా అవసరం అనిపించినపుడు చెప్తానని… పవర్ స్టార్ చెప్పినట్లుగా అలీ ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తమ మధ్య ఉన్న స్నేహంలో రాజకీయాల గురించి ఎప్పుడు చర్చించలేదని, ఎప్పుడూ సరదా కబుర్లు మాత్రమే ఉంటాయని వారిద్దరి మధ్య సంబంధాలను గురించి తెలిపారు. పవన్ పిలిస్తే కదన రంగంలోకి దూకడానికి తాను రెడీ అన్న సంకేతాలను అయితే అలీ వ్యక్తపరిచారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

7 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

7 hours ago