
అయితే వాళ్ళని డైవర్ట్ చెయ్యడంలో టీవీ9 చాలా తేలికగా సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఈ వివాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ తరువాతి చిత్రం… వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ను తమ ఛానల్ లో ఇంటర్వ్యూ చేసింది టీవీ9. ఆ ఛానల్ తో ఉన్న విరోధం మొత్తం మర్చిపోయి జనసైనికులు ఆ ఇంటర్వ్యూ సంబరాలలో మునిగిపోయారు.
ఆ ఛానల్ లో వచ్చిన ఇంటర్వ్యూ క్లిప్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మొత్తానికి తిట్టిన నోటితోనే తమకు పబ్లిసిటీ చేయించుకుంది ఆ ఛానల్. జనసైనికులతో అదే ప్రాబ్లెమ్… ఏ విషయం నుండైనా ఈజీగా డైవర్ట్ అయిపోతారు. కొందరు ఈ వైఖరికే జనసేనకు రాజకీయాలలో సీరియస్నెస్ లేదు అంటారు.
అయితే ఈ విషయంలో పూర్తిగా జనసైనికులను కూడా తప్పుపట్టడానికి లేదు. టీవీ9తో వైరం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చిత్ర దర్శకుడు ఆ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నిలువరించి ఉండాల్సింది. ఇటువంటివి కూడా పగడ్బందీగా చేసుకోకపోతే రాజకీయాలలో ఇబ్బందే.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…