
అందులో భాగంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ పాలనపై ఎటకారపు డైలాగ్స్ తో ముఖ్యమంత్రి జగన్ ను ఎద్దేవా చేసారు.
ఏ మాత్రం పరిపాలనా దక్షత లేకుండా జగన్ రెడ్డి తయారయ్యారని, ఇల్లు కదలకుండా సీఎం జగన్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పాలన చేస్తున్నారని ఛలోక్తులు విసిరారు.
ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాల్సింది పోయి, జిల్లాకు 2 కోట్ల చొప్పున నష్టపరిహారం ప్రకటించడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీ మాత్రం వరద ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తోందని, త్వరలోనే పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు.
ఏదో మొక్కుబడి రాజకీయాలు కాకుండా, క్రియాశీలక రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తే, అటు పార్టీకి, ఇటు నేతలకు ప్రజలలో గుర్తింపు లభిస్తుందన్న సూచనలు రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్నాయి.
The anger expressed by Mega DSC sports quota teachers in Vijayawada highlights concerns over the…
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల భూములు, ఫామ్‌హౌసులు పరిశీలనకంటూ కాంగ్రెస్ నాయకులు బస్సులు వేసుకొని పర్యటనలు చేస్తుండటం కాస్త…