
తెలుగు సినిమా టీజర్ మాదిరే ‘జనతా గ్యారేజ్’ మలయాళ టీజర్ కూడా యూ ట్యూబ్ రికార్డులను తిరగరాసింది. కేవలం 69 గంటలలో 1 మిలియన్ క్లిక్స్ అందుకున్న మలయాళ భాష టీజర్ గా ‘జనతా గ్యారేజ్’ సరికొత్త రికార్డులను కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ‘ఒక పోస్టర్’ను పోస్ట్ చేస్తూ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుండడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో రెట్టింపు అవుతున్నాయి. తెలుగు టీజర్ ఇప్పటికే 3 మిలియన్ క్లిక్స్ ను దాటిపోయి, హాఫ్ బిలియన్ కోసం పరుగులు పెడుతుండగా, మలయాళ టీజర్ 2 మిలియన్ దిశగా అడుగులు వేస్తోంది. మరో పన్నెండు రోజుల్లో ఈ సినిమా ఆడియో విడుదల కానుందన్న సమాచారం జూనియర్ అభిమానులను ఉత్సాహంలో ముంచుతోంది.
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…