
అవును… జూనియర్ అభిమానులకు అంత నమ్మకం ఇచ్చింది ఈ 34 సెకన్ల చిన్న టీజర్. జూనియర్ ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్, ముఖ్యంగా ఆ బైక్ తిప్పుతున్న షాట్… ఈ టీజర్ ను పదే పదే చూసేలా చేస్తాయి. ఇక, బ్యాక్ గ్రౌండ్ అందించిన దేవిశ్రీప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిజం ఎలివేట్ అయ్యే విధంగా, చూసే ప్రేక్షకులకు ఊపొచ్చే విధంగా ఈ టీజర్ ప్రధాన మార్కులు కొట్టేసాడు దేవిశ్రీ.
ఇక, కొరటాల షాట్స్, తిరునవుక్కరసు ఫోటోగ్రఫీ, ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశం… చిన్న టీజర్ అయినా ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. అదీ గాక, ఈ సినిమా థీమ్ కూడా ఎన్టీఆర్ డైలాగ్స్ ద్వారా కొరటాల స్పష్టంగా చెప్పేసాడు. దీంతో యంగ్ టైగర్ అభిమానులకు బలం వచ్చింది. ప్రస్తుతం గత రికార్డులన్నింటినీ బలహీనపరిచే దిశగా సందడి చేస్తున్నారు.
Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…
Angana Roy is completely redefining dark romance and unapologetic glamour in her latest breathtaking photoshoot.…