
మరోవైపు విభజన హామీలపై సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యావేత్తలు, సామాజిక, రాజకీయ నేతలతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అంతగాక కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలపై విస్తృతంగా చర్చించాలని ట్వీట్ చేశారు.
సంయుక్త నిజనిర్ధారణ కమిటీలో భాగం కావాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణను కలిశారు. రేపు మాజీ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలవబోతున్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ జెపి ఒక మాట అంటున్నట్టుగా కనిపిస్తుంది.
ఒక టీవీ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ కోసం పట్టు పట్టడంలో అర్ధం లేదని పేరు ఏదైనా కానీ కేంద్రం సాయం వస్తే చాలు అన్నట్టు జేపీ మాట్లాడారు. ఒకరకంగా జేపీ చంద్రబాబు చేసింది కరెక్టే అన్నట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం తప్పు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనిబట్టి పవన్ కళ్యాణ్ సంయుక్త నిజనిర్ధారణ కమిటీలో ఏర్పడకముందే అభిప్రాయబేధాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…
For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…