
శశికళ వ్యవహారశైలి దారుణంగా ఉందని… అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు బాధను కలిగిస్తున్నాయని తెలిపారు. జయలలితకు చిన్ననాటి స్నేహితులను శశికళ దూరం చేసిందని చాందిని పంకజ్ బులానీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ కు వచ్చి జయ పరామర్శించారని… ఆ తర్వాత జయను కలిసే అవకాశాన్ని కూడా శశికళ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. జయను కలిసేందుకు ఒకసారి పన్నీర్ సెల్వం అపాయింట్మెంట్ ఇచ్చారని… కానీ, శశికళ మనుషులు తనను అడ్డుకున్నారని చెప్పారు.
తమ స్నేహితులెవరూ జయను కలవకుండా శశికళ దూరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వం మాత్రం చాలా గొప్ప వ్యక్తి అని… చివరిసారి తాము జయతో కలసి భోజనం చేసినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. పన్నీర్ సెల్వం వంటి వారిని తన రాజకీయ వారసుడిగా జయ ప్రకటించి ఉంటే బాగుండేదని, మరో స్నేహితురాలు శ్రీమతి అయ్యంగార్ అన్నారు. జయలలిత ఆశయాలను కేవలం పన్నీర్ సెల్వం మాత్రమే నెరవేరుస్తారని బాదర్ సయీద్ తెలిపారు.
Suriya's anticipated film Scene directed by Jithu Madhavan is gearing up for a worldwide theatrical…
Ram Charan and Sukumar’s second collaboration, tentatively titled RC 17, is already creating curiosity with…