
[m9ad]
జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిని కమిషన్ కార్యదర్శి కోమల ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా జయ చికిత్స పొందిన ఐసీయూలోకి వెళ్లిన ఆమె ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేక గదిలో జయ చికిత్స పొందుతున్నప్పుడు శశికళ ఓ వీడియోను చిత్రీకరించి విడుదల చేశారు. అందులో జయ టీవీ చూస్తూ జ్యూస్ తాగుతున్నట్టుగా ఉంది.
అయితే ఈ వీడియో నకిలీదని కోమల గుర్తించారు. జయ పడుకున్న మంచానికి ఎదురుగా ద్వారం మాత్రమే ఉండడంతో ఆమె అనుమానం మరింత బలపడింది. జయ చికిత్స పొందుతున్న మంచానికి ఎదురుగా ఉన్న గోడకు టీవీ అమర్చే అవకాశమే లేదని గుర్తించారు. దీంతో ఆ వీడియో నకిలీదని తేలిందని కోమల తెలిపారు. పలు కోణాల్లో నిర్వహించిన దర్యాప్తులోనూ ఆ వీడియో నకిలీదని అన్నారు.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…