
కాంచీపురం జిల్లాలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధ ఏకాంబరనాథర్ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం మట్టితో చేసి ఉంటుంది. అయితే ఈ విగ్రహం ధ్వంసమైందన్న కారణంతో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. కానీ, చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు, మూల విరాట్టు విగ్రహాన్ని మార్చడం వల్ల రాష్ట్రాధినేతకు ప్రాణహాని కలగవచ్చని పలువురు సూచించినా లెక్క చేయని కమిటీ 5వ తేదీన విగ్రహాన్ని ప్రతిష్టించింది.
అయితే 5వ తేదీన అమ్మ కాలం చేయడం, అదే తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరగడంతో… ఈ కారణం వలనే రాష్ట్ర ముఖ్యాధినేత మరణించిందన్న ప్రచారం తమిళనాట ప్రారంభమైంది. ఎన్నో పురాతన దేవాలయాలు, ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలకు నిలయమైన తమిళనాడులో భక్తులకు నమ్మకాలు ఎక్కవన్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా కాంచీపురంలో జరిగిన విగ్రహ ప్రతిష్టకు, జయలలిత మరణానికి ముడిపెట్టిచూస్తున్నారు. అంతేలెండి… ఎవరి నమ్మకాలు వారివి..!
The teaser of Chakkora - Lunar Love Bird has been released, offering a mix of…
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…