
1989 నుంచి జయలలిత సంతకంతోనే అభ్యర్థులకు బీఫాంలు జారీ చేస్తున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల కోసం అక్టోబరు 28న అన్నాడీఎంకే అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారు అందించిన బీఫాంలలో పార్టీ అధినేత్రి జయలలిత సంతకం ఉండాల్సిన చోట వేలిముద్ర ఉంది. సీఎం పూర్తిగా కోలుకున్నారని, త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని, ఆమె స్వయంగా తన చేతులతో ఆహారాన్ని తీసుకుంటున్నారని చెబుతున్న నేతలు ఆమె వేలిముద్ర ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. వేలిముద్ర వేసింది నిజంగా జయలలితేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. బీఫాంలలో వేలిముద్ర చెల్లుతుందా? అని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జయలలిత కుడి చేతిగుండా మందులు ఎక్కిస్తుండడంతో ఆమె ఎడమ చేతి బొటనవేలితో ముద్ర వేయాల్సి వచ్చిందని వేలిముద్రకు సాక్షి సంతకం చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ వివరణ ఇచ్చారు. వేలిముద్ర విషయమై ఈసీ కూడా వివరణ ఇచ్చింది. అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు అందజేసే ఏ,బీ ఫాంలలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత వేలి ముద్రలు వినియోగిస్తున్నట్టు గత నెల 26న పార్టీ కార్యాలయం నుంచి తమకు లేఖ అందిందని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వైద్యుడి సమక్షంలో జయలలిత వేసిన వేలిముద్ర చెల్లుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…