Telugu

పవన్ కళ్యాణ్ సినిమా ఆడదని ముందే తెలుసు!

రీమేక్ సినిమాలలో నటించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కొత్తేమీ కాదు. మూడవ చిత్రం ‘సుస్వాగతం’తో ప్రారంభమై, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘కాటమరాయుడు’ వరకు అనేక రీమేక్ లలో నటించారు. అందులో బాలీవుడ్ సినిమా ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్ గా ‘తీన్ మార్’ కూడా ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఎలా వచ్చిందో జయంత్ సి పరాన్జీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

పవన్ కళ్యాణ్ తో తనకు మొదట నుండి మంచి అనుబంధం ఉందని, తన మొదటి సినిమా ‘ప్రేమించుకుందాం… రా…’ సినిమా చూసి బోకే పట్టుకుని తనకు అభినందనలు తెలిపారని, నిజానికి తన రెండవ సినిమా పవన్ కళ్యాణ్ తోనే చేయాల్సి ఉందని, అయితే మధ్యలో మెగాస్టార్ చిరంజీవి రావడంతో ‘బావగారు బాగున్నారా’ అయ్యిందని, ఆ అనుబంధంతోనే పవన్ తనకు ‘తీన్ మార్’ సినిమాకు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడదన్న విషయం తనకు ముందే తెలుసనీ, ఈ చిత్ర కధ పవన్ కు సూట్ అవ్వదని, తెలుగులో ఆడే సినిమా కాదని, అయినప్పటికీ ఆ సినిమాకు పనిచేయాల్సి వచ్చిందని, ఈ సినిమా విడుదలైన మొదటి రోజు పవన్ అభిమానులు వచ్చి నా ఇంటి ముందు గొడవ చేసారు, వారిని ఎలాగోలా సర్దిచెప్పి పంపించానని నాటి “తీన్ మార్” సంగతులను నెమరువేసుకున్నారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Beyond Their Own Films: Directors Making Room for New Talent

Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…

3 minutes ago

Janmashtami Special: Ram Charan Celebrates With His Little Ones

Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…

44 minutes ago