పవన్‌ పాటలకు డాన్స్‌ వేసిన రాజశేఖర్‌

పవన్‌ కళ్యాణ్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌’లో రాజశేఖర్‌ హిట్‌ సాంగ్‌ రోజ్‌ రోజ్‌ రోజ పువ్వ.. అనే సాంగ్‌ను వాడిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల తర్వాత ఆ విషయం భారీగా ప్రచారం జరిగింది. ఆ పాటకు కమెడియన్స్‌ వేసిన స్టెప్పులు చర్చనీయాంశం అయ్యాయి. దాంతో జీవిత మరియు రాజశేఖర్‌లు పవన్‌ తమ పాటతో సక్సెస్‌ కొట్టాడు అంటూ కౌంటర్‌ వేశారు. మళ్లీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు రాజశేఖర్‌ స్వయంగా స్టెప్పులు వేశాడు. అయితే రాజశేఖర్‌ స్టెప్పులు వేసింది సినిమాలో కాదు, ఒక స్టేజ్‌పై.

దీపావళి సందర్బంగా అక్కడ తెలుగు వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీవిత మరియు రాజశేఖర్‌ దంపతులు పాల్గొన్నారు. ఆ సమయంలో వీరిద్దరు కలిసి పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అప్పుడే పవన్‌ కళ్యాణ్‌కు చెందిన రెండు మూడు సాంగ్స్‌కు రాజశేఖర్‌ తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నాడు. అప్పుడు పవన్‌ తన పాటను వాడితే కౌంటర్‌ ఇచ్చిన రాజశేఖర్‌ ఇప్పుడు పవన్‌ పాటకు ఎలా డాన్స్‌ వేశాడు అంటూ కొందరు పవర్‌స్టార్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇందుకు రాజశేఖర్‌ ఎలా సమాధానం చెబుతాడు అనేది చూడాలి.

Share
Published by

Recent Posts

Visa Date Not Valid Anymore? Telugu Couple’s US Stay Cut Short

A supposedly happy trip for a couple from Hyderabad recently turned into a nightmare. Their…

15 minutes ago

Irumudi: Netflix Saved Ravi Teja from Toxic’s Shadow?

According to the latest industry buzz, Mythri Movie Makers reportedly wanted to postpone Ravi Teja’s…

30 minutes ago