
KCR political silence and BRS future
తెలంగాణ తెచ్చిన నేతగా, ప్రత్యేక తెలంగాణ మొదటి సీఎంగా దశాబ్దం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 2023 ఎన్నికల తరువాత కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కానీ, బిఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన విషయాల మీద కానీ, చివరికి కల్వకుంట్ల కుటుంబ వివాదాల గురించి కానీ కనీసం స్పందించలేదు.
ఒక్క ఓటమి కేసీఆర్ ని ఇలా మూగవాడిగా ఎందుకు మార్చింది.? ఇన్నేళ్లు రాజకీయ అజ్ఞాతంలోకి ఎందుకు నెట్టింది.? తెలంగాణ ప్రజల మనసు గెలిచిన నాయకుడిగా ఎదిగిన కేసీఆర్ కనీసం రాష్ట్రంలో ప్రజలు పడుతున్న అనేక కష్టాల మీద, రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యల మీద స్పందించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు.?
కేసీఆర్ ఈ మౌనం రేపటి రోజున బిఆర్ఎస్ పార్టీకి వరంగా మారుతుందా.? లేదా శాపంలా వెంటాడుతుందా.? ఇప్పటికే సొంత కుమార్తె కవిత సైతం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. తన రాజకీయ వారసుడైన కేటీఆర్ నాయకత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తానూ నమ్మినబంటులా భావించే హరీష్ రావు ను గుంటనక్కగా కట్టప్పగా అభివర్ణిస్తున్నారు. అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన మీద కూడా అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోపక్క మా నెక్స్ట్ టర్గెట్ తెలంగాణ అంటూ ప్రధాని మోడీ నుంచి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరకు చాల బలమైన రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు, బీజేపీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అంశాల మీద అవినీతి జరిగిందంటూ కేసీఆర్ ప్రభుత్వం నుంచి నోటీసులు ఎదుర్కొన్నారు. అలాగే కల్వకుంట్ల భూ ఆస్తుల చిట్టా పొద్దు అంటూ సీఎం రేవంత్ కేసీఆర్ భూముల లెక్కలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుపెట్టారు.
తన పై వస్తున్న అవినీతి ఆరోపణలకు, తన ప్రభుత్వం పై ఎదురవుతున్న అక్రమాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా, బిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల నేతలకు తాళం వేసేలా కేసీఆర్ పేల్చే తుపాకీ లాంటి ప్రకటన కోసం బిఆర్ఎస్ శ్రేణులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు..?
Bellamkonda Sai Sreenivas’ upcoming film Tyson Naidu, directed by Saagar K Chandra, is getting ready…
వైసీపీ నుంచి అవమానభారం తో బయటకొచ్చి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్న విజయసాయిరెడ్డి మరోసారి వైసీపీ అధినేత వైఎస్…