Telugu

టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్న సెలబ్రిటీ జంట?

ప్రస్తుతం ‘గరుడ వేగ’ సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న జీవిత, రాజశేఖర్ లు మళ్లీ రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే పలు పార్టీలలో పనిచేసిన ఈ ఇద్దరూ… మళ్లీ టీడీపీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జీవిత ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మీరు టీడీపీలోకి చేరనున్నారా అంటూ ఆమెను ప్రశ్నిస్తే… చేరమంటే, చేరుతానంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

మరోవైపు వీరిని పార్టీలోకి చేర్చుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. మొదట్లో జీవిత, రాజశేఖర్ లు టీడీపీ సానుభూతిపరులుగానే ఉన్నారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ లో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిఫలంగా జీవితకు సెన్సార్ బోర్డు పదవి దక్కింది. ఆ తర్వాత వీరు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ సొంత పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు వీరు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ruthless CBN Firing @ IAS Review Meeting!

Back in the 90s, Chandrababu Naidu was one of the most ruthless politicians in India…

6 minutes ago

Samantha Was Okay Without Kids, Then Life Changed

Samantha Ruth Prabhu had apparently reached a point where she was completely okay with never…

36 minutes ago