Telugu

“జెట్ లీ” సినిమా రివ్యూ: విమాన వైపరీత్యం!

చిత్రం: జెట్ లీ

M9 రేటింగ్: 2/5

ADVERTISEMENT

విడుదల తేదీ: మే 01, 2026

తారాగణం: సత్య, వెన్నెల కిషోర్, రియా సింఘా, అజయ్, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు

నిర్మాణ సంస్థ: క్లాప్ ఎంటర్టైన్మెంట్

దర్శకత్వం: రితేష్ రానా

సంగీతం: కాలభైరవ

నిర్మాత: చిరంజీవి(చెర్రీ) – హేమలత పెదమల్లు

ఛాయాగ్రహణం: సురేష్ సారంగం

కూర్పు: కార్తీక శ్రీనివాస్

పాపులర్ కమెడియన్ సత్యను హీరోగా పరిచయం చేస్తూ రితేష్ రానా తెరకెక్కించిన తాజా చిత్రం “జెట్ లీ”. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ సమర్పణలో చెర్రీ నిర్మించారు. హీరోగా సత్య గెలిచాడా? ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడా? రితేష్ రానా మార్క్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగారా? అనేది చూద్దాం..!!

కథ:

ఇండియాలో ఓ ప్రైవేట్ బ్యాంక్ దివాళా తీస్తుంది, దాని ఓనర్ ప్రజాపతి (అజయ్) ఓ సామాన్య మేనేజర్ ను ఇరికించి ఫారిన్ వెళ్ళిపోతాడు. అయితే.. ఇండియన్ పోలీసులు మాత్రం అతడ్ని పట్టుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తారు.

కట్ చేస్తే.. అదే ఫ్లైట్ లో కడుపులో పెన్ను గుచ్చుకుని సడన్ గా గతం గుర్తు లేకుండా నిద్ర లేస్తాడు వేదవ్యాస్ అలియాస్ జాన్ సీనా అలియాస్ హీరో (సత్య). తాను ఎవరు? ఫ్లైట్ లో ఏం జరుగుతుంది? అనే క్లారిటీ లేక చాలా ఇబ్బందులుపడుతూ ఉంటాడు.

ఇంతకీ ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) సక్సెస్ ఫుల్ గా ప్రజాపతిని ఇండియా తీసుకురాగలిగిందా? ఆకాశంలో ఎదురైన ఇబ్బందులేమిటి? ఇందులో సత్య పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “జెట్ లీ” కథాంశం.

నటీనటుల పనితీరు:

కమెడియన్ గా సత్య ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తాడు. అతడి పాత్రలో బోలెడంత కన్ఫ్యూజన్ ఉన్నా.. అతడి కామెడీ మాత్రం క్లైయర్ గా ఉంటుంది. అందువల్ల సినిమాతో సంబంధం లేకుండా అతడి టైమింగ్, రైమింగ్ ఎంజాయ్ చేస్తాం. అయితే.. సత్యకి ఆ విగ్ పెట్టడం వల్ల సినిమాకి ఒరిగింది ఏంటి అనేది దర్శకుడికే తెలియాలి.
అజయ్ కొత్తగా కనిపించాడు కానీ.. అతడి క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం కనిపించలేదు. విజయ్ మాల్యాకి స్పూఫ్ లా ఉంది తప్పితే, సినిమా మొత్తానికి కీలకమైన పాత్ర ఆసక్తికరంగా లేకపోవడం గమనార్హం.

రియా సింఘా హీరోయిన్ గా కనిపించడానికి చాలా కష్టపడింది కానీ.. నటిగా మాత్రం అలరించలేకపోయింది. లిప్ సింక్ వరకు ఏదో ట్రై చేసింది కానీ.. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మాత్రం డొల్ల.

వెన్నెల కిషోర్ కూడా తన బెస్ట్ ఇచ్చాడు. అయితే.. అతడి క్యారెక్టర్ ట్విస్ట్ అనేది రివీల్ అయ్యే టైంకి ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది. అందువల్ల అది సరిగా వర్కవుట్ అవ్వలేదు.

హర్ష చెముడు, కబీర్ దుహాన్ సింగ్ వంటి నటులు ఉన్నప్పటికీ.. కో-పైలట్ పాత్ర పోషించిన సాయి సోమయాజులు ముద్ద పాటలతో నవ్వించగలిగాడు.

సాంకేతికవర్గం పనితీరు:

కెమెరా, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ వంటి డిపార్ట్మెంట్స్ బడ్జెట్ కి తగ్గ అవుట్ పుట్ ఇచ్చారు. ఉన్న ఒక్క పాటని ఎండ్ క్రెడిట్స్ లో వేయడంతో సత్య కష్టపడి వేసిన స్టెప్పులు చూడకుండానే చాలామంది థియేటర్ల నుంచి వెళ్లిపోయారు.

దర్శకుడు రితేష్ రానా ప్రతి సన్నివేశంలో ఏదో ఒక మీమ్ లేదా హాలీవుడ్ సినిమా రిఫరెన్స్ లేదా కమర్షియల్ టెంప్లేట్ మీద సెటైర్ లా ప్రయత్నించాడు కానీ.. అది ఆ రిఫరెన్సులు తెలిసినవాళ్ళకి, హిడెన్ డీటెయిల్స్ అర్థం చేసుకునేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.

సగటు సాధారణ ప్రేక్షకుడికి ఆ కామెడీ అర్థమవ్వడం కష్టమే. ఓటీటీ రిలీజ్ తర్వాత మాత్రం ఆ డీటెయిలింగ్ గురించి పాజ్ చేసి మరీ మాట్లాడుకుంటారు. సో, థియేటరికల్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో రితేష్ తడబడ్డాడనే చెప్పాలి.

విశ్లేషణ:

మనం చెప్పే కథ ప్రేక్షకుడికి అర్థమయ్యాక, కథనంలో ఎన్ని గారడీలైనా చేయొచ్చు. అంతే కానీ.. అసలు కథ ఏమిటి అనేది అర్థం కాకుండా ఏదేదో చేస్తే మాత్రం ప్రేక్షదుకు సింపుల్ గా ముబైల్ ఓపెన్ చేసి రీల్స్/షార్ట్స్ చూడడం స్టార్ట్ చేస్తాడు. “జెట్ లీ” విషయంలో జరిగింది అదే. సెటప్ కొత్తగా ఉన్నా.. స్క్రీన్ ప్లేలో క్లారిటీ లేక ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది “జెట్ లీ”. కాకపోతే.. సినిమాలో చాలా డీటెయిలింగ్ ఉంటుంది, అది ఓటీటీలోకి వచ్చాక పాజ్ చేసుకుని చూసి ఆస్వాదించాలి. ఆ కష్టం మొత్తం వృథా అవ్వడం బాధాకరం.

ఓవరాల్ గా.. విమాన వైపరీత్యం!

M9 రేటింగ్: 2/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

14 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

18 minutes ago