
ప్రతీవారం లానే ఈ వారం కూడా రెండుమూడు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో “జెట్లీ, గాయపడ్డ సింహం” ప్రముఖమైనవి. వీటిలో మోస్ట్ ఎవైటెడ్ సినిమా “జెట్లీ”. సత్య హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుండడం, “మత్తు వదలరా” తర్వాత రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో “జెట్లీ”పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదేవారం విడుదలవుతున్న మరో సినిమా “గాయపడ్డ సింహం”. షార్ట్ ఫిలిం డైరెక్టర్ కశ్యప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో నిజానికి ఏ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. కానీ జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూలు, ట్రైలర్ లో ఫన్ కంటెంట్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లింది.
మాములుగా చిన్న సినిమాలు టాక్ స్ప్రెడ్ అవ్వడం కోసం ప్రీమియర్లు వేస్తుంటారు. “గాయపడ్డ సింహం” కోసం ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు. “జెట్లీ” టీమ్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
సత్య కూడా మీడియా ముందు రాలేదు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఓ రెండు చేశాడు తప్పితే.. జనాల్లోకి సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేయలేదు. అలాగే ప్రీమియర్ షోలు కూడా వేయడం లేదు.
ఓవరాల్ గా చూసుకుంటే.. రేపు విడుదలవుతున్న “జెట్లీ, గాయపడ్డ సింహం” చిత్రాల్లో సింహానిదే ముందడుగు అని చెప్పొచ్చు. రిలీజ్ తర్వాత ఏ సినిమా ఫేట్ ఎలా మారుతుంది? అనేది మాత్రం చూడాలి. ఈ రెండూ కామెడీ సినిమాలు కావడం గమనార్హం.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…