
అలాగే జియా ఖాన్ మెడపై, కింది దవడల వద్ద కూడా మచ్చలు కనిపించాయి. ఇవి చున్నీతో ఉరి వేసుకోవడం వల్ల ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని డిఫెన్స్ వాదించింది. దీంతోనే ఈ కేసులో ప్రదాన నిందితుడు సూరజ్ పంచోలీకి బెయిల్ లభించింది. దీంతో విభేదించిన జియాఖాన్ తల్లి రబియా అమీన్ అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ నిపుణులతో రిపోర్టు తయారు చేయించారు. ఇందులో ముంబై పోలీసుల వాదనతో ఏకీభవించని వారు, ముంబై పోలీసుల వాదనను తప్పుపట్టారు.
జియా ఖాన్ ది ఆత్మహత్య కాదు హత్యే అయి ఉండొచ్చని లండన్ కు చెందిన జేసన్ పేన్ జేమ్స్ ఫోరెన్సిక్ సంస్థ వాదిస్తోంది. జియా ఖాన్ కింది పెదవిపై అయిన గాయాలు ఆమెపై బలమైన ఒత్తిడి పడడం వల్లే అయ్యాయని ఈ రిపోర్టు చెబుతోంది. జియా ఖాన్ మెడ, దవడలపై కనిపించిన గాయాలు చున్నీ కారణంగా అయినవి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ రూపొందించిన రిపోర్టును జియా తల్లి రబియా అమిన్ బుధవారం నాడు బాంబే హైకోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో దాదాపు విచారణ పూర్తి కావచ్చిన ఈ కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Bigg Boss Telugu TV show is entering an interesting phase right now. So far, the…
Ram Charan and Sukumar's RC17 has naturally created huge expectations. The combination is particularly exciting…