
“ప్రస్తుతం ఉచిత కాల్స్, ఆఫర్లతో వ్యూహాత్మకంగా రిలయన్స్ ‘జియో’ హవా సాగుతోంది. మార్చి వరకూ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 5.5 కోట్ల మంది వరకూ ఉన్న వినియోగదారుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ ఉచిత సేవలను ఇస్తున్నందు వలనే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని” సదరు నితిన్ సోనీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఎయిర్ టెల్, ఐడియా సేవలను వినియోగిస్తున్న వారు, రెండో సిమ్ గా రిలయన్స్ జియోను తీసుకుని ఉచిత ఆఫర్లు వాడుతున్నారని, ఒకసారి డబ్బు చెల్లించాలని చెప్పిన తరవాత, వీరిలో అత్యధికులు జియో సిమ్ లను పక్కన పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 1నే రిలయన్స్ ‘జియో’ కస్టమర్ల సంఖ్య 10 శాతం తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. నిజానికి వినియోగదారుల ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ‘జియో’ వాడుతున్న వారిలో ఎక్కువ శాతం ‘ఫ్రీ డేటా’ ఆఫర్ ప్రభావమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…