
తాజాగా “ఫోర్స్-2” చిత్రంలో కారును ఎత్తే స్టంట్ చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల టాక్. అందుకోసం 1580 కిలోలు బరువున్న బెంజ్ కారును డూప్ సాయం లేకుండా జాన్ అబ్రహం ఎత్తాల్సి ఉండగా, ఒక్కడే దాన్ని మోయడం సాధ్యం కాదని, మరో ఇద్దరి సాయంతో జాన్ కారు ఎత్తగలిగాడని దర్శకుడు విపుల్ అమృత్‌లాల్ షా పేర్కొన్నాడు. చిత్రంలో కారు ఎత్తే సీనుకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా సన్నివేశం రియలిస్టిక్‌గా అనిపించడానికి చిత్ర హీరో జాన్ ఈ పనిచేసినట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.
జాన్ కారును ఎత్తాలనుకోవడం అభినందించదగిన విషయమని, సినిమా కోసం ఆయన కష్టపడిన దానిలో వేరే నటులు ఉంటే పదో వంతు కూడా చేయలేరని ప్రశంసలు కురిపించారు. ఫోర్స్-2 ట్రైలర్ వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందని, ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…