Telugu

గుర్రం పని గుర్రం… గాడిద పని గాడిద..!

కన్నులపండుగగా హైదరాబాద్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో 2016 సంవత్సరానికి గానూ “ఉత్తమ నటుడు”గా జూనియర్ ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. ఈ విభాగం నుండి తారక్ కు అల్లు అర్జున్ నుండి గట్టిపోటీ ఎదురు కావడంతో… చివరికి ఏ హీరో ఈ అవార్డు దక్కించుకుంటాడోనని ఇరువురు హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. వీరిద్దరితో పాటు నాని, నాగార్జున, నాగచైతన్య, రామ్ చరణ్ లు కూడా బరిలో ఉన్నప్పటికీ, బన్నీకి – తారక్ కు మధ్యే అసలు పోటీ నెలకొంది.

అయితే “సరైనోడు” సినిమాలో అల్లు అర్జున్ ప్రదర్శించిన అభినయం విమర్శకుల అవార్డుల కంటే, కమర్షియల్ యాంగిల్ లోనే ఉండడంతో, జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమాకు పోటీ లేకుండా పోయింది. ఉత్తమ నటుడు అవార్డు విభాగంలో తారక్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం అంతా జూనియర్ నామస్మరణతో మారుమ్రోగడంతో, తారక్ కున్న రేంజ్ ఏమిటో మరోసారి తెలిసి వచ్చింది. ‘బుడ్డోడు’కు అవార్డు ప్రకటించే సమయంలో తారక్ పక్కనే బన్నీ కూర్చుని ఉండడం విశేషం.

ADVERTISEMENT

అయితే తారక్ కు అవార్డు ప్రకటన ఇపుడు వచ్చిందేమో గానీ, గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూసినపుడే ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు… 2016 సంవత్సరానికి ఉత్తమ నటుడు ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆరేనని! ఇక అవార్డు అందుకునే సమయంలో… ‘మీరు డైరెక్షన్ చేయబోతున్నారని విన్నాం’ అన్న ప్రశ్నకు ‘లేదండి… గుర్రం పని గుర్రం చేయాలి… గాడిద పని గాడిద చేయాలి…’ అంటూ దర్శకత్వం పట్ల తన ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పాడు. అయితే ఈ డైలాగ్ వేరే హీరోలకు బాగా కనెక్ట్ అయ్యిందనుకోండి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

6 minutes ago

Karthi’s Desperate Attempt to Turn Mass: Wrong Choice?

Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…

36 minutes ago