
అయితే సినిమాలో కొమరం భీమ్ కు ముస్లిం టోపీ పెట్టడం పై ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శుద్ధి చేసారు యువకులు. నిజాం నిరంకుశ పాలన పై కొమరం భీమ్ పోరాడితే, రాజమౌళి భీమ్ ను ముస్లిమ్ గా చూపించడం దారుణమని బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అయితే సినిమాలో ముస్లిం యువకుడిగా భీమ్ ఏదైనా మారు వేషం ఉండవచ్చు అని కొందరు అనుకుంటున్నారు. సినిమాలో ఈ దశలో అసలు విషయంపై రాజమౌళి క్లియర్ గా ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చు. గతంలోనే ఇది కల్పిత కథ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే ఏ మేరకు అది ఉంటుంది అనేది చూడాలి.
అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి పోరాటాలకు ముందు ఢీల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో అనేది ఈ చిత్రం. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ హీరోయిన్ నటిస్తుంది.
కొన్ని పదాలు, సంఖ్యలు కొన్నిటికి ప్రతీకలుగా మారుతుంటాయి. అటువంటిదే ‘11’కూడా. గత ఎన్నికలలో 175/175 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి…
Telangana BJP president N. Ramchander Rao is among the contenders for the Hyderabad–Rangareddy–Mahabubnagar Graduate MLC…