Telugu

మాకు మండిపోతోంది.. ఇదేం ముహూర్తం?

కొన్ని పదాలు, సంఖ్యలు కొన్నిటికి ప్రతీకలుగా మారుతుంటాయి. అటువంటిదే ‘11’కూడా. గత ఎన్నికలలో 175/175 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికినందునే అంత చిన్న సంఖ్య ‘11’ భూతద్దంలో నుంచి చూస్తున్నట్లు చాలా పెద్దదిగా కనిపిస్తోంది.

కనుక టీడీపి కూడా వీలైనంత వరకు శాసనసభ సమావేశాల తేదీ, అవి మొదలయ్యే సమయం వరకు ప్రతీదీ 11 ఉండేలా చేస్తూ వైసీపీని బాగానే పొలిటికల్ ర్యాగింగ్ చేస్తుంటుంది. టీడీపి పొలిటికల్ ర్యాగింగ్ సరిపోదన్నట్లు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా మొదలుపెట్టారు.

ADVERTISEMENT

నిన్న విజయదశమి రోజున తన కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మాట మర్చి నవంబర్‌ అంటే 11వ నెలలో 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

ఈ సందర్భంగా అయన రాష్ట్రంలోని టీడీపి, వైసీపీల గురించి, తన కొత్తపార్టీ ఆశయాల గురించి చెప్పిన మాటలకంటే, అయన ప్రకటించిన ఈ 11-11-11-11-11 ముహూర్తమే అందరినీ ఆకర్షిస్తోంది.

ఆయన కొత్త పార్టీ అంటూ కాస్త హడావుడి చేసిన తర్వాత జగన్‌తో చేతులు కలుపుతారనుకుంటే, ఈవిధంగా ముహూర్తం ప్రకటించి, ఇలా పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారేమిటి? అని ‘అసమదీయులు’ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

అయన మొట్ట మొదట వైసీపీలో నంబర్: 2, సజ్జల రామకృష్ణా రెడ్డిని టార్గెట్ చేసుకొని కొన్ని విమర్శలు చేశారు. కానీ విజయసాయి రెడ్డి ఈ ముహూర్తం ప్రకటించి 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లు గడిచినా అటువైపు నుంచి సౌండ్ లేదేమిటో!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Telangana MLC Polls: Caste and Candidates

Telangana BJP president N. Ramchander Rao is among the contenders for the Hyderabad–Rangareddy–Mahabubnagar Graduate MLC…

7 minutes ago

వైసీపీ కనుసన్నలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయా?

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి స్థానిక సంస్థల ఎన్నికలలో దూకుడుగా వ్యవహరిస్తుంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న…

24 minutes ago