Telugu

జూనియర్ ఎన్టీఆర్ – వారసత్వం బరువు కాదు బాధ్యత

స్టార్ లెగసిని మోయడం ఎంత బరువుంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అందులోనూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా రాయల్ కార్డుతో ఎంట్రీ ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకోవడం, ఆ ఒత్తిడిని తట్టుకోవడం నిత్యం తప్పించుకోవాల్సిన మెడ మీద కత్తి లాంటిది. చైల్డ్ ఆర్టిస్ట్ గా రామాయణంతో మంచి గుర్తింపు వచ్చినా, హీరోగా ఉషాకిరణ్ లాంటి పెద్ద బ్యానర్ తో నిన్ను చూడాలని రూపంలో లాంచ్ దొరికినా ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన స్టూడెంట్ నెంబర్ వన్ ఘనవిజయం సాధించినప్పుడు తాత పోలికలంటూ ప్రేక్షకులు అభిమానులు పొగడ్తలతో తడిసి ముద్దచేయడం కథలుగా వచ్చాయి

సుబ్బు రూపంలో తొలి డిజాస్టర్ హెచ్చరిక చేసినా ఆ వెంటనే ఆది రూపంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఆకాశంలో నిలబెట్టేసింది. అల్లరి రాముడు, నాగలు దెబ్బ కొట్టినా సింహాద్రి ఇచ్చిన ఇండస్ట్రీ హిట్ నిజంగానే ఒకరకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది. పాతికేళ్లు నిండని వయసులో అంత సక్సెస్ చూసినప్పుడు చుట్టూ మందిమాగధుల పొగడ్తలు ప్రభావం చూపించడం సహజం..చాలా ఏళ్ళ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తనే ఆ మాట చెప్పాడు. ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ కు వచ్చిన జనసందోహం మర్చిపోయేదా. కానీ సినిమా పోయింది. సాంబ ఓ మోస్తరుగా వెళ్లినా నా అల్లుడు, నరసింహుడు, అశోక్ ఇవేవి అంచనాల బరువును మోయలేక కుదేలయ్యాయి.

ADVERTISEMENT

రాఖీ తనలో రియల్ పెర్ఫార్మర్ ని బయటికి తీసుకొచ్చింది. కానీ తెలుగు హీరోలు స్టైలిష్ గా సన్నగా ఉండాలనే ఆడియన్స్ ఆలోచనాధోరణికి భిన్నంగా బొద్దుగా ఉండటం తన ఇమేజ్ మీద చూపుతున్న ప్రభావాన్ని గుర్తించి ఒంటిని కష్టపెట్టి మరీ చేసిన యమదొంగ అంత విజయం సాధించడంలో జక్కన్న ప్రతిభకన్నా తారక్ నటవిశ్వరూపమే ఎక్కువ దోహదం చేసింది. కంత్రి, శక్తి, దమ్ము, ఊసరవెల్లి, రభస రూపంలో స్పీడ్ బ్రేకర్లు పడ్డా బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లతో మళ్ళీ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ మరో మూడు మేలి మలుపులయ్యాయి

జూనియర్ కు సవాళ్లు క్రమం తప్పకుండా స్వాగతం చెబుతూనే వచ్చాయి. ఆర్ఆర్ఆర్ రిలీజప్పుడు ఆస్కార్ క్యాంపైన్ చేసినప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని వర్గాలు కావాలని చేసిన బురద జల్లే ప్రయత్నం అర్థం లేని ఫ్యాన్ వార్ కి దారిచ్చింది. ఆఖరికి సింహాద్రి రీ రిలీజ్ ని సైతం లక్ష్యంగా చేసుకుంటున్న వాళ్ళ గురించి నవ్వుకోవడం కన్నా ఇంకే స్పందన అక్కర్లేదు. సమయం ఎంతగా వృథా అవుతున్నా గుర్తుండిపోయే సినిమాలే చేయాలని దేవరకు అంత టైం ఇవ్వడం ఎందుకో అర్థం చేసుకోవచ్చు. యాంకర్ గా బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాలకు వ్యాఖ్యాత విజయం సాధించడం మరికొందరు హీరోలను అదే బాట పట్టేలా చేసింది. అంగబలం అభిమానగణం ఎంత ఉన్నా ఎప్పటికప్పుడు సవాళ్ళను స్వీకరిస్తూ సాగడమే తాత నేర్పించిన తారక మంత్రంగా ప్రతి పుట్టినరోజూ గుర్తుచేసుకోవాలి

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Why Ramayan Release Crucial for Shah Rukh Khan’s King?

Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…

24 minutes ago

Why Did Rajamouli Slow Down Suddenly?

SS Rajamouli is known for his large-scale filmmaking and carefully planned promotional campaigns. The director…

54 minutes ago