
ఒక డిజాస్టర్ పడినా కూడా నమ్మకంతో తారక్ ఇచ్చిన అవకాశాన్ని కొరటాల శివ ఏ స్థాయిలో వాడుకుంటాడో చెప్పేందుకు ఇక నుంచి మొదలుపెట్టే ప్రతి ప్రమోషన్ సాక్ష్యంగా నిలుస్తుంది. హైప్ పెరగాలన్నా తగ్గాలన్నా పూర్తిగా వీటి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే టైటిల్ విషయంలో చాలా గుట్టుని మైంటైన్ చేసి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బయటికి వచ్చేలా చేశారు. గెటప్ కు సంబంధించి మాత్రం ఎలాంటి క్లూస్ లేకుండా జాగ్రత్త పడిన తీరు ఇప్పుడీ దేవర ఫస్ట్ లుక్ కు సానుకూలాంశంగా మారింది.
దేవర సక్సెస్ తారక్ కు సైతం చాలా కీలకం. అరవింద సమేత వీర రాఘవ వచ్చి నాలుగేళ్లు దాటేసింది. ఆర్ఆర్ఆర్ వచ్చినా అది మల్టీ స్టారర్ కాబట్టి సోలో హీరోగా యంగ్ టైగర్ ని తెరమీద చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. అందుకే సింహాద్రి లాంటి ఇరవై ఏళ్ళ పాత సినిమాకు సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్, వందల కొద్ది షోలు ప్లాన్ చేసుకుని తమ ఫ్యానిజం చూపిస్తున్నారు. ఇది ఒకందుకు మంచిదే. తన మీద ఎంత అంచనాల బరువుందో జూనియర్ తో పాటు కొరటాల శివకు అర్థమవుతుంది.
జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఎలాగూ ప్యాన్ ఇండియా ఫ్లేవర్ కు ఉపయోగపడుతుంది. జపాన్ లాంటి దేశాల్లో తారక్ కు వచ్చిన ఫాలోయింగ్ దృష్ట్యా మేకింగ్ కు సంబంధించి నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ మొదటిసారి జూనియర్ మూవీకి సంగీతం సమకూర్చడం, సముద్రం బ్యాక్ డ్రాప్ లో వయొలెంట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఇది ఉండబోతోందని క్యాప్షన్స్ రూపంలో సంకేతం ఇవ్వడం ఇవన్నీ దేవరకు మంచి శకునాలే. మరి ఎలాంటి గెలుపు అందుకుంటాడో.
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…
SS Rajamouli is known for his large-scale filmmaking and carefully planned promotional campaigns. The director…