
అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు? అనే విషయంపై మల్లగుల్లాలు పడిన రాజు గారికి ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ‘శ్రీనివాసుడు’ దొరికేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా కధను ఇటీవల దర్శకుడు సతీష్ వేగేశ్న మరియు దిల్ రాజులు కలిసి జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా, కధ విని వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వెనువెంటనే సాధ్యం కాదన్న తారక్ కాస్త సమయం తీసుకుని చేద్దామని చెప్పడంలో దిల్ రాజు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘జై లవకుశ’ సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దిల్ రాజు – సతీష్ వేగేశ్నల “శ్రీనివాస కళ్యాణం” సినిమా ప్రారంభించే యోచనలో ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల సమాచారం. గతంలో ‘బృందావనం’ సినిమాతో తారక్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ చేసిన దిల్ రాజు, మరోసారి అదే తరహా ఫ్యామిలీ సబ్జెక్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎంపిక చేసుకోవడం విశేషం.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…