Telugu

ఎన్టీఆర్ ను మళ్ళీ టిడిపిలోకి తీసుకువస్తారా?

తెలుగుదేశం పార్టీకి – జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న ‘దూరం’ తెలియనిది కాదు. అలాగే నందమూరి బాలకృష్ణకు – జూనియర్ కు ఉన్న ఎలాంటి సంబంధాలు ఉన్నాయో కూడా అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా ఎపుడూ చెప్పకపోయినా, పరోక్షంగా వారు చేసే వ్యాఖ్యల ద్వారా, వారివురి వర్గాల మధ్య ఎలాంటి ‘వాతావరణం’ నెలకొంది అన్న విషయం సగటు ప్రజానీకానికి తెలిసిన విషయమే. అయితే భవిష్యత్తులో ఈ దూరం తగ్గుతుందా? వీరిద్దరి నడుమ ‘పెద్దన్నయ్య’ పాత్రను ఎవరైనా పోషిస్తారా? ఇదే ప్రశ్నలను బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా పేర్కొనే అంబికా కృష్ణను ఓ మీడియా ఛానల్ అడుగగా…

ఆ ‘పెద్దన్నయ్య’ పాత్రను పోషించడానికి తానెవరిని? అందుకోసం చాలామంది ఉన్నారు. ఒకటి నుండి లెక్కపెడితే నా స్థానం ఏ 11వదో అయి ఉంటుంది. పెద్దాయన నుండి చాలామంది పూనుకుంటే గానీ జరిగే విషయం కాదని అంబికా కృష్ణ సుస్పష్టంగా చెప్పేసారు. అంతేకాదు, బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా… సంబంధాలు అయితే ఉన్నాయి గానీ, అవి ఆరోగ్యకరమైనవో, అనారోగ్యకరమైనవో అన్న విషయం తనకు తెలియదని, సంబంధాలను వ్యాపారాలతో వాటిని ముడిపెట్టలేమని… చెప్పాల్సిన సమాచారాన్ని పరోక్షంగా చెప్పారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలను టిడిపి నేతలు గానీ, కార్యకర్తలు గానీ తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. అదే నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమా అన్ని కోట్లు ఎలా తీసుకువస్తుందని, అలాగే ఆ తర్వాత విడుదలైన మరో సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యిందని, ‘టెంపర్’కు కూడా భారీ వసూళ్లు వచ్చాయని, ఇవన్నీ ఒట్టి పుకార్లేనని ఖండించారు. బాలయ్యకు అత్యంత సన్నిహిత వ్యక్తులలో అంబికా కృష్ణ చెప్పిన సమాధానాలు ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజా వ్యాఖ్యలతో క్లియర్ పిక్చర్ వచ్చేసినట్లేగా!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Samyuktha Joins Ram’s #RAPO23

A birthday celebration has turned into an official casting update for Ram Pothineni’s #RAPO23. The…

4 minutes ago

Bigg Boss Telugu: No End For Thrigun’s Loose Tongue On Rohith

Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…

31 minutes ago