
‘జనతా గ్యారేజ్’ విడుదల తేదీపై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీగా ఖరారు చేసారు. ఇటీవల వర్షాల వలన ఓ వారం రోజుల పాటు షూటింగ్ కు ఇబ్బంది కలిగిందని, భారీ కాస్టింగ్ కావడంతో అందరి తేదీలను అడ్జెస్ట్ చేసి మళ్ళీ షూట్ చేయడానికి సమయం కావాలని, దాదాపు ఇంకా 10 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉందని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చారు. సాంకేతిక నిపుణులకు తగినంత సమయం ఇచ్చి, సినిమాకు ‘బెస్ట్ అవుట్ పుట్’ ఇవ్వడానికి మూడు వారాల పాటు వాయిదా వేయడం జరిగిందని కొరటాల తెలిపారు.
అలాగే తమ సినిమా వలన ఇతర సినిమాలకు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో, విడుదల తేదీని ముందుగా ప్రకటిస్తున్నామని, ఇతర సినిమాలు కూడా విడుదలలు ఉన్నాయని, వారు కూడా అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారని నిర్మాత యెర్నేని ప్రకటించారు. ‘జనతా గ్యారేజ్’ విడుదల వాయిదా పట్ల అభిమానులు కాస్తంత నిరుత్సాహ పడడం సహజమే అయినప్పటికీ, ఓ మంచి కధను చిట్టచివరిలో పాడు చేయడం ఇష్టం లేక వాయిదా ప్రకటన వేస్తున్నామన్న చిత్ర యూనిట్ బృందం వ్యాఖ్యలను అభిమానులు స్వాగతిస్తున్నారు.
అయితే ఈ సినిమా అసలు వాయిదాకు కారణం రజనీకాంత్ ‘కబాలి’ అన్న టాక్ కూడా హల్చల్ చేస్తోంది. ఇదే నిజమైతే, గతేడాది ‘బాహుబలి’ సినిమా కోసం తమ ‘శ్రీమంతుడు’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మూడు వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ‘బాహుబలి’ బృందం మరియు ‘శ్రీమంతుడు’ యూనిట్ అధికారికంగానే డిక్లేర్ చేసారు. ఆ తర్వాత జరిగిన బాక్సాఫీస్ ప్రభంజనం ఏమిటో అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’ ఆల్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టగా, ‘శ్రీమంతుడు’ టాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టింది.
అదే సెంటిమెంట్ తో ‘కబాలి’ కోసం వాయిదా పడ్డ ‘జనతా గ్యారేజ్’ కూడా రికార్డులను తిరగరాసే చిత్రంగా అవుతుందని ‘యంగ్ టైగర్’ అభిమానులు అంటున్నారు. అది తెలియాలంటే సెప్టెంబర్ 2వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక, ఆడియో విడుదలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత ఇస్తామని, ఆగష్టు మొదటి లేక రెండవ వారంలో ఆడియో విడుదల ఉంటుందని దర్శకనిర్మాతలు తెలిపారు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…