Telugu

అరడజను సినిమాలు వచ్చాయి.. సందడి మాత్రం రాలేదు!

ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.

సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క సినిమా తప్ప మిగతావేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కంటెంట్‌, రివ్యూలు, బాక్సాఫీస్‌.. ఎక్కడా చెప్పుకోదగ్గ సందడి కనిపించడం లేదు.

ADVERTISEMENT

తెలుగులోనే మూడు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. Sandeep Vanga బ్రాండ్‌తో వచ్చిన ‘Romanchakam’ రివ్యూల పరంగా కానీ, బాక్సాఫీస్‌ దగ్గర కానీ ఎలాంటి ప్రభావం చూపడం లేదు.

Allari Naresh నటించిన ‘Ramba Oorvasi Menaka’ పూర్తిగా పాతకాలపు సినిమా కావడంతో దాని గురించి చర్చించుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు.

మరో చిన్న సినిమా ‘Saha’ పరిస్థితి కూడా అంతే.

వీటికి తోడు Dulquer Salman నటించిన ‘I’m Game’ కూడా కనీస స్థాయిలో బాక్సాఫీస్‌ సందడి చేయడం లేదు. కంటెంట్‌ పరంగా కూడా ప్రేక్షకుల్లో ఎలాంటి చర్చను మొదలుపెట్టలేకపోయింది.

ఈ సినిమాల మధ్య ఆశ్చర్యంగా మంచి వసూళ్లు రాబడుతున్నది ‘Mirzapur’. పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ను ఫీచర్‌ ఫిల్మ్‌గా మార్చి తీసుకొచ్చిన ఈ సినిమా పరిపూర్ణంగా లేకపోయినా, బాక్సాఫీస్‌ దగ్గర డబ్బులు తెస్తోంది. ప్రేక్షకుల్లో కొంత చర్చను కూడా రేపుతోంది.

తెలుగు సినిమా అభిమానులకు మాత్రం ఇది దాదాపు నిశ్శబ్ద వీకెండ్‌. అమెరికాలో లాంగ్‌ వీకెండ్‌ కూడా కావడంతో ఒక్క మంచి సినిమా ఉన్నా థియేటర్ల దగ్గర పరిస్థితి వేరుగా ఉండేది.

గత కొన్ని వారాల్లో కనిపించిన ఉత్సాహం ఈసారి పూర్తిగా మిస్సయింది.

Share
Chaitanya Krishna

I’m passionate about Telugu cinema, but I also enjoy watching films in other languages, especially Malayalam and Tamil. I love offering critical yet meaningful analysis of movies.

Published by

Recent Posts

Pakistan Players Mocked Earlier? Now Rohit? Fans Speechless

Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…

16 minutes ago

Vishwak Sen’s ‘LEGACY’ Gets December 4 Release

Vishwak Sen is gearing up for an intense political action drama with LEGACY, and the…

31 minutes ago