
అవును… కేవలం బిట్లు బిట్లుగా కొన్ని సన్నివేశాలను మాత్రమే చూసారు తప్ప, పూర్తి సినిమాను మూడు పాత్రలు చేసిన తారక్ కూడా వీక్షించలేదు. బహుశా ప్రేక్షకుల తీర్పు వచ్చిన తర్వాత చూద్దామని భావించారో ఏమో గానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ‘జై లవకుశ’ సినిమాను బాలయ్య బాబు చూసి మెచ్చుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది? అని యాంకర్ ప్రశ్నించగా, అందులో నిజం లేదని, బహుశా ధియేటర్స్ లోకి వచ్చాకా ఏమైనా చూస్తారేమో అంటూ జవాబిచ్చారు తారక్.
నిజానికి తన సినిమాను తానే పూర్తి చూసుకోలేదని, కేవలం అక్కడక్కడ కొన్ని షాట్స్ మాత్రమే చూశానని చెప్పడంలో సదరు యాంకర్ అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తనకు టెన్షన్ గా ఉందని, అందుకే సినిమాను చూడలేకపోయానని, అయితే తన సోదరుడు, సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ మాత్రం చూసారని, ‘అవుట్ పుట్’ అద్భుతంగా వచ్చిందని తనకు చెప్పాడని, ఫ్యాన్స్ కు కావాల్సిన విషయాన్ని వెల్లడించాడు. బహుశా సినిమా ధియేటర్లలో తన అభిమానులతో కలిసి చూడాలని ‘బుడ్డోడు’ భావిస్తున్నారేమో..!
ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య…
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…