Telugu

కమ్మ కార్డుతో తారక్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే తన 37వ పడిలోకి అడుగుపెట్టాడు. సోషల్ మీడియాలో ఈ సారి బర్త్ డే చాలా అపురూపంగా జరిగింది. ఫ్యాన్స్ ట్విట్టర్ ని ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తో నింపేశారు. ఇప్పటికే ఉన్న ట్విట్టర్ ట్రెండ్ రికార్డులు అన్నీ బద్దలైపోయాయి. సెలెబ్రిటీలు కూడా తారక్ కు విషెస్ చెప్పడానికి పోటీ పడ్డారు.

టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ తో సహా కొందరు టీడీపీ నాయకులు కూడా విషెస్ చెప్పడం విశేషం. మళ్ళీ ఎన్టీఆర్ టీడీపీ, నందమూరి కుటుంబం కలిసిపోతారని భయపడ్డారో ఏమో గానీ అధికార పార్టీకి చెందిన మీడియా రంగంలోకి దిగింది. సినీ రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న ఎన్టీఆర్ ని దెబ్బ తీస్తే, ఒకవేళ కుటుంబం పార్టీతో కలిసినా ఉపయోగం ఉండదు అని ప్లాన్ చేసింది.

ADVERTISEMENT

ఎన్టీఆర్ ని ఒక కులానికి పరిమితం చేస్తే… ఎన్టీఆర్ కమ్మ వారి చివరి అస్త్రం అంటూ పెద్ద పెద్ద వ్యాసాలు రాయడం మొదలు పెట్టింది. గతంలో ఇదే విధంగా ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన ఒక కులానికే పరిమితం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత చాలా కష్టపడి ఎన్టీఆర్ ఆ మరకను చెరుపుకుని అన్ని వర్గాల వారికీ దగ్గరయ్యాడు.

ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం జరుగుతుందని తారక్ అభిమానులు ఆరోపిస్తున్నారు. తారక్ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగానే ఉండబోతున్నట్టు చాలా సార్లు ప్రకటించాడు. పూర్తి స్థాయిలో సినిమాల మీదే దృష్టిపెట్టాడు. సొంత సోదరి పోటీ చేస్తున్నా ప్రచారానికి వెళ్ళలేదు. అయినా అతనిని టార్గెట్ చెయ్యడం మానలేదు అంటూ అభిమానులు వాపోతున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Looks Like a TV Serial? Brutal Trolls on Drishyam 3 Trailer

The trailer of Drishyam 3 starring Mohanlal and directed by Jeethu Joseph was released recently…

1 hour ago

ఇప్పటికైనా సూర్యకి లైన్ క్లియర్ అయ్యిందా ?

తమిళనాడు మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విజయ్ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ…

2 hours ago