
ఇలా తెలుగు ప్రాజెక్ట్ లు కాకుండా ఒక బాలీవుడ్ సినిమాను బిగ్ బీతో కూడా చేసేందుకు పూరీ అమితాబ్ నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఇంత టైట్ షెడ్యూల్ లో మరో సినిమాకు పూరీ సిద్ధమవుతున్నారని మీడియా వర్గాల టాక్. జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్లో “నేతాజీ” అనే సినిమా రూపుదిద్దుకోబోతున్నట్లుగా ప్రముఖ మీడియా ఛానల్ సంచలన కధనం ప్రసారం చేసింది.
ఏ విషయమైనా ముందుగా సోషల్ మీడియాలో సందేశం పంపించే పూరీ, ‘నేతాజీ’ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా బయటకు పొక్కిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 20వ తేదీన పూరీ తెలియజేస్తారని పేర్కొన్న సమాచారంలో వాస్తవం తెలియాలంటే మరో 10 రోజులు వేచిచూడాలి. అయితే ‘నేతాజీ’ టైటిల్ అదిరిపోయింది అంటున్నారు ‘బుడ్డోడు’ అభిమానులు.
Bigg Boss Telugu season 10 is set to occupy a special place in reality show…
Jr. NTR attended the pre-release event of Don’t Trouble the Trouble as the chief guest.…