
సినిమాలో వీరిద్దరి లుక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు జక్కన్న. ఈ హీరోలను ఆ ఉద్యమ వీరుల పాత్రలలో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే రోజున వీరి లుక్స్ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ కనీసం కొమరం భీం జయంతికి కూడా ఎన్టీఆర్ లుక్ విడుదల చేయలేదు.
తాజాగా వచ్చే ఏడాది చరణ్ పుట్టిన రోజు కానుకగా అల్లూరి పాత్రను, ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు కొమరం భీం పాత్రను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. చరణ్ పుట్టినరోజు మార్చ్ 27కాగా, ఎన్టీఆర్ ది మే 20, ఎన్టీఆర్ కంటే కూడా చరణ్ లుక్ నే మొదట విడుదల చేసే అవకాశం ఉంది.
మరోవైపు రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం.
ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో కనిపిస్తోంది. ఇంతవరకు జరిగిన, ఇంకా…
The deputy CM of Andhra Pradesh, Pawan Kalyan has another facet and it is regarding…