Telugu

ప్రజలు మనవైపే ఉంటే ఇంత అల్లర్లు, విధ్వంసం దేనికి?

ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్‌ ప్రక్రియలో కనిపిస్తోంది.

ఇంతవరకు జరిగిన, ఇంకా జరుగుతున్న అల్లర్లు, ఘర్షణలు, భౌతిక దాడులు, విధ్వంసాన్ని చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇందుకు అధికార పార్టీ నేతలు వైసీపీని నిందిస్తుంటే, వైసీపీ వారిని నిందిస్తోంది.

ADVERTISEMENT

ఇలాంటి సమయంలో పోలీసులు, ఎన్నికల సంఘం చాలా కీలకపాత్ర పోషించాలి. కానీ వారి కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. కనుకనే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కానీ అది జోక్యం చేసుకున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

ఇరు వర్గాలకు చెందినవారు అభ్యర్ధుల చేతిలో నుంచి నామినేషన్స్‌ పత్రాలు బలవంతంగా గుంజుకోవడం, చించేయడం వంటివి చూస్తుంటే, ఎవరికీ గెలుస్తామనే నమ్మకం లేకనే ఈ విధంగా చేస్తున్నారా?అని అనుమానం కలుగుతుంది.

ఒకసారి కాస్త ఫ్లాష్ బ్యాకులోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. టంచనుగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.

రాజధాని అమరావతి, పోలవరంతో సహా వెలిగొండ, నల్లమల్ల సాగర్‌ ద్వారా రాష్ట్రంలో పలు జిల్లాలకు నీళ్ళు పారుతున్నాయి. ఏపీలో క్రాప్ హాలీడే కూడా ప్రకటించలేదని బీఆర్ఎస్‌ నేతలు కడుపు మంటతో బాధపడుతూనే ఉన్నారు. ఇక సంక్షేమ పధకాలన్నీ యధావిధిగా అమలవుతూనే ఉన్నాయి.

వైసీపీ అధినేత మూడు ప్యాలస్‌ల మద్య తిరుగుతూ రాజకీయాలు చేస్తుంటే, సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం అవుతున్నారు. కనుక ఏవిధంగా చూసినా ప్రజలు కూటమి ప్రభుత్వం వైపే ఉంటారని అర్థమవుతూనే ఉంది.

ఇక చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రంలో అన్ని రంగాల్లో భ్రష్టు పట్టి పోయింది. అవినీతి రాజ్యం ఏలుతోంది. ప్రజలు వేసారిపోయి ఉన్నారు. మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బల్లగుద్ది వాదిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

ఈ విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ప్రజలు తమ వైపే ఉన్నారని గట్టి నమ్మకంతో ఉన్నప్పుడు, ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఈ ఎన్నికలో ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి?అని సందేహం కలుగుతుంది.

బహుశః తాము చెప్పుకుంటున్న మాటలని తామే నమ్మకపోవడం వలనా? లేక ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారనే భయం వల్లనా? లేక ఈ ఎన్నికల్లో గెలిచి ప్రత్యర్ధులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలనా?లేక దిగజారుతున్న రాజకీయాలను రాజ్యాంగ వ్యవస్థలు సరి చేయలేకపోవడం వల్లనా?

కానీ రాజకీయాలు ఇంత వేగంగా దిగజారిపోతే, దానికి ఆయా పార్టీలు, వాటి నేతలే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకుంటే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

PK Back In Films? Not in Near Future?

The deputy CM of Andhra Pradesh, Pawan Kalyan has another facet and it is regarding…

14 minutes ago

క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…

32 minutes ago