
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేత రాయలసీమ మాండలికంతో తన మాటల తూటాలను పలికించబోతున్నారని సమాచారం. రాయలసీమ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గతంలో చాలా సినిమాలు చేసారు గానీ, అందులో భాష యొక్క యాస సాధారణంగానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో పక్కా రాయలసీమ మాండలికంతో తారక్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
‘అజ్ఞాతవాసి’ వంటి దారుణమైన పరాజయాన్ని చవిచూసిన త్రివిక్రమ్, పట్టుదలతో ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లుగా టాక్. సీమ ఫ్యాక్షనిజంతో పాటు పొలిటికల్ యాంగిల్ కూడా ఈ సినిమాలో ఉండనుందని మరో వార్త. గతేడాది దసరాకు ‘జై లవకుశ’ సినిమాతో అభిమానులను పలకరించిన తారక్, ఈ దసరాకు ఎలాంటి హంగామా సృష్టిస్తాడో చూడాలి.
Aadarsha Kutumbam marks the long-awaited collaboration between Trivikram and Venkatesh arriving after a 22-year wait!…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…