
అయితే, ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ టాలీవుడ్ కు కొత్త కాదు. గతంలో ప్రిన్స్ మహేష్ బాబుకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ తొలిసారిగా ట్విట్టర్ వేదికగా వెలిబుచ్చిన ‘మా’ అవార్డుల అంశం వివాదాస్పదమైంది. అయితే ఇది తానూ పెట్టిన ట్వీట్ కాదని ప్రిన్స్ వివాదానికి తెరదించాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ అగ్ర హీరోకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురై సంచలనం రేపింది.
టాలీవుడ్ ప్రధాన హీరోలలో మహేష్, జూనియర్ ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ బారిన పడడంతో, ఇక పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి వారు కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరముందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ సైట్లే హ్యాకింగ్ కు గురవుతుంటే, సెలబ్రిటీల అకౌంట్లను హ్యాక్ చేయడం పెద్ద విషయమేమీ కాదన్నది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
It's a reward-versus-revenge theme in the Bigg Boss house, and the contestants play tasks amid…
Tamil Nadu Chief Minister Vijay is reportedly set to face the camera again, but this…