
సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల నటనను చూసిన వ్యక్తిగా… వారిద్దరిలో సారూప్యం గురించి మాట్లాడుతూ… తనకు తెలిసినంత వరకు పెద్దాయనకు చుట్టూప్రక్కల పది కిలోమీటర్ల వరకు ఎవరూ రాలేరు, రారు..! జూనియర్ ఎన్టీఆరే కాదు, ఎవరికీ అంత సీన్ లేదు. ఆయన తీరు వేరు, ఆయన క్రియేషన్ వేరు… ప్రస్తుత తరం వారెవరికి లేదు… ఒక మానవత్వం కలిగిన మనిషిగా ఆయన దగ్గరికి ఎవరూ రారు… జూనియర్ ఎన్టీఆర్లు గానీ, ఇంకొకడు ఇంకొకడు గానీ ఎవరూ రారు అంటూ సూటిగా చెప్పారు.
పెద్దాయన సినిమాలను రీమేక్ చేస్తే అవన్నీ ఫ్లాప్ లే అవుతాయని, గతంలో బాలకృష్ణ చేసి వైఫల్యం చెందాడని, ఇక జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడే, ఏ పాత్రలైనా చేయగలడు గానీ, ఒక రావణాసురుడు వేషం వేస్తే… డైలాగ్ ల వరకు బాగానే చెప్తాడు గానీ, ఆ ఆహార్యం సరిపోదని, మరీ జానేడు ఉంటాడని, ఒకవేళ మీ లాంటి వాళ్ళు ఎవరైనా తీస్తాను, ఆయన చేస్తే… జనం చూస్తారో చస్తారో తర్వాత విషయం, తీసేస్తారు కదా… అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుందని, కానీ ఒకళ్ళ గురించి అలా మాట్లాడడం తప్పని అన్నారు చలపతిరావు.
‘గుండమ్మకధ’ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను ఈ తరం హీరోలలో ఎవరు చేసినా బాగోరని చెప్పిన చలపతి, కనీసం నాగేశ్వరరావు పాత్ర రొమాంటిక్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు గానీ, ఎన్టీఆర్ పాత్రను చేయగలిగే వారు లేరని, ఒక్క ‘గుండమ్మకధ’ కాదు, ఎన్టీఆర్ నటించిన కొన్ని కళాఖండాలు “రాముడు భీముడు” వంటి సినిమాలను ఎవరూ రీమేక్ చేయలేరని, ఒకవేళ చేసినా అవి ఫ్లాప్ అవుతాయని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను స్వీకరించే స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం లేరన్నది సోషల్ మీడియా న్యూస్.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Fans finally have a major update on Dragon, the much-awaited collaboration between Jr. NTR and…