
వచ్చే నెల మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని సింహాద్రిని ఫోర్ కె ప్రింట్ లోకి మార్చి కొత్తగా పునఃవిడుదల చేయబోతున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. రెండు రోజుల క్రితం హఠాత్తుగా ఆదిని అదే డేట్ కి వదలబోతున్నామని ప్రకటన ఇచ్చారు. ఇది చాలదన్నట్టు తారక్ డెబ్యూ మూవీ నిన్ను చూడాలని కూడా ప్రీమియర్ చేస్తామని ట్విట్టర్ లో హంగామా మొదలుపెట్టారు. దీంతో సింహాద్రిని థర్డ్ పార్టీ ద్వారా కొని అవసరంలో ఉన్న ఇతర ఫ్యాన్స్ కు సహాయం చేయాలనుకున్న వాళ్ళకు చిక్కొచ్చి పడింది.
అసలు ముందు అనౌన్స్ చేసిన దాన్ని పట్టించుకోకుండా దానికి పోటీకి వెళ్లడం మహా విచిత్రం. దీని వల్ల అభిమానులు విడిపోయి ఏదో ఒకటే చూడాల్సి వస్తుంది. ఎవరికీ పూర్తి లాభం కలగదు. దీంతో సింహాద్రి ఆర్గనైజర్స్ తాము స్వలాభం కోసం చేయడం లేదని హీరో అనుమతి తీసుకునే ఒక సద్దుదేశంతో ప్లాన్ చేస్తున్నామని ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చారు. రెండు రోజుల క్రితం సింహాద్రి అసలు ఇండస్ట్రీ హిట్టే కాదని యాంటీ ఫ్యాన్స్ వర్గం సోషల్ మీడియాలో చాలా హడావిడి చేసింది. పరస్పరం డిబేట్లు గట్రా జరిగాయి.
2003లో యాభై అయిదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సింహాద్రికి ఇప్పుడు ఫ్రెష్ గా సర్టిఫికెట్ అవసరం లేదు. ఆ రికార్డుని ఎరూ దాటలేకపోయారు. ఇప్పుడు కావాలని కొత్త తరం అభిమానులను కన్ఫ్యూజ్ చేసేందుకు అది అంత స్థాయిలో హిట్ కాలేదని బుకాయిస్తే నిజం అబద్ధమైపోదు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం తారక్ ని టార్గెట్ చేసుకుని అమలు పరుస్తున్న వ్యూహమని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకపక్క డబుల్ రీ రిలీజులు మరోపక్క సక్సెస్ గురించి కొత్త ఉపమానాలు ఇలా చేస్తున్న వాళ్ళ ఉద్దేశాలు ఏమిటో అర్థమవుతున్నాయి కనక వీలైనంత దూరంగా ఈ ట్రాప్ లోకి పడకుండా ఉంటే థియేటర్ లో సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. లేదా ఇంకా పెచ్చుమీరుతుంది.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…