
లీగల్ సమస్యలు ఎదురవుతాయనే భావనతో సదరు హీరోయిన్ పేరును బయటపెట్టని నిర్మాతలు… ఆమెకు సంబంధించిన కొన్ని లీకులు మాత్రం ఇచ్చారు. ఖాన్ లలో ఒకరితో తన తొలి సినిమాను ఆమె చేసిందని… ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఊపేసిందని వారు హింట్ ఇచ్చారు. ఓ తమిళ-తెలుగు స్టార్ తో నడిపిన అఫైర్ తో ఆమె కెరీర్ ముగిసిందని చెప్పారు. ఆ తర్వాత ఆమె దక్షిణాది నుంచి భోజ్ పురికి వెళ్లిందని అన్నారు.
ఈ అంశంపై పహ్లాజ్ నిహ్లానీని ఐఏఎన్ఎస్ ప్రశ్నించగా… ఇది కచ్చితంగా ఓ మాజీ హీరోయిన్ కథతో తీసిన సినిమానే అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో నటించిన ఇద్దరు కీలక నటుల్లో ఒకరితో ఆమెకు గతంలో సంబంధం కూడా ఉందని చెప్పారు. ఆమె ఎవరో అనే విషయాన్ని తాము చెప్పదలుచుకోలేదని… ఎందుకంటే ఆమె పేరు బయటకు వస్తే సినిమా ఆగిపోయే అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం తమ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని… రాయ్ లక్ష్మీ పోషించిన ఆ మాజీ హీరోయిన్ ఎవరో అందరికీ అర్థమైపోతుందని చెప్పారు.
నిర్మాతలు నిహ్లానీ చెప్పిన వివరాల ప్రకారం ఆమె ముమ్మాటికీ నగ్మానే అని అర్థమైపోతోంది. తన తొలి సినిమా ‘బాఘీ’లో ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఆ తర్వాత దక్షిణాదికి షిఫ్ట్ అయి చిరంజీవి, రజనీకాంత్ లాంటి అగ్రనటుల సరసన చేసింది. శరత్ కుమార్ తో ఆమెకు అఫైర్ ఉందనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, శరత్ కుమార్ భార్య చాయ అప్పట్లో విడాకులకు అప్లై చేసుకుంది.
ఆ తర్వాత భోజ్ పురి సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత… లీడింగ్ యాక్టర్ రవి కిషన్ తో ఆమె అఫైర్ కొనసాగించింది. ‘జూలీ 2’లో రవికిషన్ కూడా నటించాడు. ఇవే విషయంపై నగ్మాను డెక్కన్ క్రానికల్ ప్రశ్నించాగా, “ఔనా? దీనికి సంబంధించి నాకు ఇంత వరకు తెలియదు. ఈ వార్తను నేను తొలిసారిగా వింటున్నా. ‘పద్మావతి’ సినిమా మాత్రమే వార్తల్లో ఉండటంతో… బహుశా కొంచెం పబ్లిసిటీ కోసం ‘జూలీ 2’ నిర్మాతలు ఇలాంటి హింట్స్ ఇచ్చారేమో” అంటూ సమాధానం ఇచ్చింది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…