
పేరుకే పెద్దిలో ఉన్నది పెద్ద ట్విస్ట్ కానీ.. సినిమా అనౌన్స్ మెంట్ ముందే ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఇండస్ట్రీ వర్గాలందరికీ తెలుసు. ఇక సినిమా రిలీజ్ కి ఆరు నెలల ముందు నుండే ప్రతి సగటు సినిమా ప్రేక్షకుడికి ఆ ట్విస్ట్ ఏంటి అనేది తెలిసిపోయింది. దాంతో ఆ ట్విస్ట్ ఎలా వర్కవుట్ అవుతుంది, బుచ్చిబాబు ఎలా డీల్ చేశాడు అనేదాని కోసం మాత్రం వెయిట్ చేశారు ఆడియన్స్. అందువల్ల చరణ్ కాలు నరుక్కోవడం, పారాలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది పెద్ద ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ అవ్వలేకపోయాయి.
ఇప్పుడు ఇంచుమించుగా అలాంటి షాకింగ్ ఫ్యాక్టర్స్ తోనే ఓ రెండు సినిమాలు వస్తున్నాయి. రెండు సినిమాల్లోనూ హీరోల పాత్రల ద్వారానే మేజర్ ట్విస్టులు ఉంటాయట. ఓ సినిమాలో అయితే హీరో ద్వారా క్రియేట్ అయ్యే ట్విస్ట్ హీరోయిన్ పాత్రకి కూడా ఎఫెక్ట్ అవుతుందట. అయితే.. ఈ రెండు సినిమాలు జూలై నెలలోనే విడుదలవుతుండడం అనేది గమనార్హంగా మారింది.
అదృష్టవశాత్తు “పెద్ది” ట్విస్ట్ లాగ.. ఈ రెండు సినిమాల ట్విస్టులు ఇంకా బయటికి రాలేదు. అతికొద్ది మంది ఫిలిం ఇండస్ట్రీ వ్యక్తులకు మాత్రమే సదరు ట్విస్టుల గురించి తెలుసు. అందువల్ల థియేట్రికల్ ఆడియన్స్ కి ఆ ట్విస్టులు షాకింగ్ ఫ్యాక్టర్స్ గా వర్కవుట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ.
మరి రెండు సినిమాల బృందాలు ఆ ట్విస్టులు బయటికి పొక్కకుండా ఎంతవరకు మ్యానేజ్ చేయగలరు? లేదా గతంలో “రాజు వెడ్స్ రాంబాయి” తరహాలో మార్కెటింగ్ కోసం ట్విస్టును లాస్ట్ మినిట్ లో రివీల్ చేసేసి అటెన్షన్ గ్రాబ్ చేసే ప్రయత్నం చేస్తారా? అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…