Telugu

రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్ అన్న పేరు ఎప్పుడూ సంచలనమే. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే ఇండస్ట్రీ రికార్డులు సొంతం చేసుకుని టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయ రంగంలో చేసిన ప్రసంగాలు మరింత సంచలనంగా నిలిచాయి.

తారక్ పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు కొంతమంది టీడీపీ వర్గీయులు కూడా నిరీక్షిస్తున్న నేపధ్యంలో, అసలు తారక్ మనసులో ఏముంది? ఇదే ప్రశ్నను ఇటీవల ఓ మీడియా ప్రతినిధి అడుగగా, దానికి జవాబు ఇచ్చారు మన జూనియర్ ఎన్టీఆర్.

ADVERTISEMENT

ప్రస్తుతం నా లైఫ్ లో ఉన్న ఫేజ్ తో చాలా ఆనందంగా ఉన్నాను, ఓ నటుడిగా ఈ జర్నీని ఇప్పుడిప్పుడే బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ముందుగా దాని వరకే పరిమితం కావాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నటుడిగా నేను చేస్తోన్న పని నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. దానిని పూర్తిగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసారు.

తదుపరి ఐదేళ్లల్లో లేక పదేళ్లలో ఏం జరుగుతుందోనని ఆలోచించే వాడిని కాదని, వర్తమానంలో బతికేవాడినని జూనియర్ చెప్పిన సందేశం స్పష్టంగా ఉండడంతో, తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు ఓ క్లియర్ కట్ సందేశం ఇచ్చినట్లయింది.

ముఖ్యంగా ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా రాజకీయ వివాదాలను సృష్టించి, వాటిని టీడీపీతో లింక్ పెట్టి ఇబ్బందులు సృష్టించాలని వివిధ ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో, తారక్ చెప్పిన ఈ సంగతులతో అందరికి సమాధానం లభించినట్లే.

ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్, సమ్మర్ సమయం ముగిసిన తర్వాత కొరటాల శివ సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నారు. అలాగే తదుపరి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ మాస్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు తారక్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana: Will Domestic Bookings Deliver the Big Numbers?

Ramayana has crossed $820K in overseas advance bookings, and now the focus shifts to India.…

2 minutes ago

రాచమల్లు: ఏకగ్రీవాలతో ఓటర్లకు 16 వేలు లాస్

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత కాస్టలీ అనేది నేటి రాజకీయ నాయకులు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న స్థానిక…

25 minutes ago