
అలాంటి సినిమాలను పరిశీలిస్తే… మహేష్ బాబు నటించిన ‘ఖలేజా,’ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ‘దమ్ము’ తదితర సినిమాలకు ఇచ్చిన పబ్లిసిటీ లోపం వలన అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘ఖలేజా’ వినడానికి ఓ పవర్ ఫుల్ టైటిల్. అలాంటి టైటిల్ ను పెట్టుకుని ఓ కామెడీ సినిమా తీస్తారని ఎవరూ ఊహించరు. కానీ, జరిగింది అదే. కామెడీ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టి, దానికి తగిన విధంగానే పవర్ ఫుల్ ప్రమోషన్స్ చేయడంతో అంతా ‘ఏదో’ ఉంటుందని ధియేటర్లోకి వెళితే, తీరా లోపల పూర్తిగా నవ్వించి వదిలిపెట్టారు. అయితే తామూ ఊహించింది లేకపోవడంతో సహజంగానే ప్రేక్షకులు తిప్పికొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ “దమ్ము” విషయంలోనూ ఇదే జరిగింది.
ఇక, తాజాగా విడుదలైన “కాష్మోరా” సినిమా విషయంలోనూ చిత్రయూనిట్ ఇలాంటి పబ్లిసిటీనే ఇచ్చారు. సినిమా చూసిన ప్రేక్షకులకు ‘వినోదం’ కనపడింది గానీ, ఎక్కడా ‘హార్రర్’ అనే ఫీలింగ్ రాకపోయింది. అయితే టైటిల్, ట్రైలర్స్ ను గమనిస్తే… ఇదొక పవర్ ఫుల్ సోషియో ఫాంటసీ, హార్రర్ తరహాలో బిల్డప్ ఇచ్చారు. “కాష్మోరా” విషయంలో జరిగిన ప్లస్ పాయింట్స్ ఏమిటంటే… ఈ సినిమాలో నటించింది అగ్ర హీరో కాకపోవడం, ఇదొక డబ్బింగ్ సినిమా కావడం. దీంతో అంచనాలు తక్కువగా విడుదలై ప్రేక్షకుల నుండి ‘ఓకే’ అనే పాస్ మార్క్ వేయించుకుంది. బహుశా ఇదే సినిమాలో ఏదొక తెలుగు పెద్ద హీరోను ఊహించుకుంటే, ఈ పాటికి ‘డిజాస్టర్’ టాక్ ఖచ్చితంగా ఉండేదని చెప్పవచ్చు.
కాబట్టి ప్రేక్షకులను థ్రిల్ చేయాలనే తాపత్రయాన్ని పక్కనపెట్టి, సినిమా కధకు అనుగుణంగా పబ్లిసిటీ ఇచ్చినట్లయితే… మానసికంగా ప్రేక్షకులు కూడా సిద్ధమై వస్తారు. లేని పక్షంలో ప్రేక్షకులు ఇచ్చే ట్విస్ట్ లకు దర్శకనిర్మాతలకు దిమ్మతిరగడం ఖాయం. ఏమైనా అనుభవం కావాలంటే… తెలుగు సినీ చరిత్రలో చాలా మంది ఉన్నారు. మొన్నటి ‘ఖలేజా, దమ్ము’ చిత్రాలే కాదు, ఆనాటి మెగాస్టార్ ‘చంటబ్బాయ్’ విషయంలోనూ ఇదే జరిగింది. మెగాస్టార్ నుండి ఓ కామెడీ చిత్రాన్ని ఊహించని అభిమానులకు, చిరు ఎంతగా కష్టపడి నవ్వించినా… బాక్సాఫీస్ వద్ద కాసులు కురవలేదన్న విషయాన్ని సినీ వర్గాలు గుర్తుంచుకుంటే మంచిది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…