Telugu

కాజల్ కు మేడం టుస్సాడ్స్ లో మైనపు బొమ్మ… నెటిజన్ల పెదవివిరుపు

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ శాఖలో ఏర్పాటు చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు.

మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరనున్న తొలి సౌతిండియా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది. అయితే దీనిపై సోషల్ మీడియా పలు రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో మేడం టుస్సాడ్స్ లో మైనపు బొమ్మ అంటే ఒక రేంజ్ ఉండేది. అక్కడ చోటు దక్కించుకోవడం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే వారు.

ADVERTISEMENT

ఇప్పుడు ఆ స్టాండర్డ్ తగ్గిపోయింది అంటున్నారు. కాజల్ పాపులర్ హీరోయినే అయితే లెజెండరీ హీరోయిన్ ఏమీ కాదు. గొప్ప సినిమాలేమీ చేసిన దాఖలాలు లేవు. ఆమె రిటైర్ ఆయాకా ఎక్కువ కాలం గుర్తు ఉంచుకునే సినిమాలు అంటే చెప్పడం కష్టమే. ఈ క్రమంలో ఏకంగా మైనపు బొమ్మ ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా మన దక్షిణాది విషయానికొస్తే.. తొలిసారిగా ప్రభాస్.. ఈ మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌లో రీసెంట్‌గానే పెట్టారు. తాజాగా సౌత్ నుంచి మూడో వ్యక్తిగా కాజల్ అగర్వాల్ ఈ మ్యూజియంలో స్థానం దక్కించుకుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BB Telugu: Bigg Boss Makes A GOAT Decision

This week's theme on the Bigg Boss Telugu reality show is GOAT. The house is…

18 minutes ago

నామినేషన్స్‌ వేయకుండానే గెలుస్తున్న వైసీపీ!

సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ఎంతగా బల్ల గుద్ది వాదించినా స్థానిక సంస్థల ఎన్నికలు…

30 minutes ago