
“నౌకాయాన శాఖ చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టులో భాగంగా రెండు మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయనున్నాం. తీరానికి దగ్గరగా ఉన్న సెజ్ లలో ఉండనున్న ఈ ఫుడ్ పార్క్ లు, ఏపీలోని కాకినాడ ప్రాంతంలో ఏర్పాటవుతుండగా, మహారాష్ట్రలో దక్షిణాన కొంకణ్ రీజియన్ లో ‘సతారా మెగా ఫుడ్’ పార్క్ పేరిట ఏర్పాటు చేయనున్నాం” అని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో ఏర్పడే ఏపీ మెగా ఫుడ్ పార్క్ నుంచి కాకినాడ ఓడరేవు ద్వారా విదేశాలకు ఎగుమతులు చేసే ఆలోచనలో ఉన్నామని వివరించింది. ఏపీలో ప్రాజెక్టుకు 184.88 కోట్లు వ్యయమవుతాయన్న అంచనాలు ఉన్నాయని, మహారాష్ట్ర ప్రాజెక్టుకు 139.33 కోట్లు కేటాయించామని తెలిపింది. ఇండియాలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్న వేళ, ఈ రెండు ప్రాజెక్టులూ ప్రజల అవసరాలను తీర్చేందుకు దోహదపడతాయని, భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…