
మరో వైపు, కళ్యాణ్ దేవ్ డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించడం గురించి ఒక ఇంటర్వ్యూ లో తన అభిప్రాయాన్ని వినిపించాడు. “ఒక స్టార్ హీరో డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి ప్రవేశిస్తే ఎవరూ ఏమీ అనరు. కాని నా లాంటి నటులు ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి ప్రవేశిస్తే, ప్రజలు మాకు ఆఫర్లు లేవని అనుకుంటారు. ఓటీటీ అరంగేట్రం నా కెరీర్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది” అని కల్యాణ్ అన్నారు.
అతను చెప్పినదాంట్లో పాయింట్ ఉందని ఒప్పుకోకతప్పదు. సూపర్ మచ్చి యొక్క ఓటీటీ విడుదల గురించి మాట్లాడుతూ… ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి నిర్మాత యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుందని కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చారు. చిత్ర నిర్మాతలు ఇప్పటికే ఆ దిశగా చర్చలు జరుపుతున్నారని సమాచారం.
కళ్యాణ్ దేవ్ 2018లో విడుదలైన ‘విజేత’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దానితో కొంత గ్యాప్ తీసుకుని తన తరువాతి ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు ఆయన. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని చాలా ఆశలే పెట్టుకున్నాడు ఈ యువ హీరో. గతంలో అనేక టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించిన పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.
The Andhra Pradesh State Election Commission has temporarily halted the election process in all 100…
The Paradise has undergone a few changes for its OTT release, with the much-trolled Dhumavati…