
‘మంచి లక్షణాలున్న అబ్బాయి’లో కల్యాణ్ రామ్ జోడీగా కాజల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. దాంతో జయేంద్ర సినిమా తాజా షెడ్యూల్ షూటింగులో పాల్గొనడానికి కల్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు. ఈ నెల 29వ తేదీ నుంచి షూటింగ్ మొదలై .. వచ్చేనెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది.
భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కథానాయికగా తమన్నా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు తనకి హిట్ ఇస్తాయనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…