
నిజమే… ‘బాహుబలి 2’ సినిమా తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే అనుభూతి కలిగింది. ప్రభాస్ పడిన నాలుగైదేళ్ళ కష్టం సిల్వర్ స్క్రీన్ లోని ప్రతి షాట్ పై కనపడుతుంది. దీంతో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకొని పక్షంలో ఈ ఏడాది ‘ఉత్తమ నటుడు’గా ‘బాహుబలి 2’లోని ప్రభాస్ ను డిక్లేర్ చేయడం లాంచనమే అని సినీ ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా “జై లవకుశ” ట్రైలర్ వేడుక పైన హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ఈ సినిమాలోని నటనకు గానూ ఎన్టీఆర్ కు జాతీయ అవార్డు వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు.
‘నత్తి’తో కూడిన క్యారెక్టర్ ను ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మినహా ఇంకా ఎవ్వరూ చేయలేరని చెప్పిన కళ్యాణ్ రామ్, నా నమ్మకం ప్రకారం ఈ ఏడాది అవార్డులన్నీ తారక్ కొట్టేస్తాడు. నేషనల్ అవార్డ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పటికే నేను సినిమా చూసాను, అదిరిపోయింది, మీకు కూడా నచ్చుతుంది… అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసే ముందు, కళ్యాణ్ రామ్ ఒక్కసారి ‘బాహుబలి 2’ను గుర్తు చేసుకుని ఉంటే బాగుండేదన్న టాక్ సర్వత్రా వినపడుతోంది.
‘జై లవకుశ’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బాగానే చేసి ఉండొచ్చు, చేస్తారు కూడా! ఎందుకంటే తారక్ అనే వ్యక్తి బోర్న్ ఆర్టిస్ట్ గనుక! అది సినిమా చూసిన కళ్యాణ్ రామ్ కు తెలుసు గనుక అంత నమ్మకంతో చెప్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ చెప్పినట్లుగా ఒక్క ‘నత్తి’ క్యారెక్టర్ ను చూసి జాతీయ అవార్డు ఇచ్చేస్తారా? సినిమాలో ‘జై’ పాత్ర ఎంతసేపు ఉంటుందో తెలియదు గానీ, ఖచ్చితంగా సినిమా ఆద్యంతం ఉండే పాత్ర అయితే కాకపోవచ్చు. ఎందుకంటే మిగిలిన రెండు పాత్రలు కూడా ఉన్నాయి గనుక వాటికి కూడా కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది.
ఇక మరీ ముఖ్యంగా ధియేటిరికల్ ట్రైలర్ లో… జాతీయ అవార్డు అందుకునే నటన అయితే కనిపించలేదన్నది వాస్తవం. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే క్యారెక్టర్ లా కనపడుతోంది తప్ప, నేషనల్ అవార్డు అందుకునే క్యారెక్టర్ లా అయితే ఏ మాత్రం కనిపించడం లేదు. సినిమా మొత్తం చూసిన తర్వాత దీనిపై ఓ కామెంట్ చేయడానికి పూర్తి అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం ‘యంగ్ టైగర్’ అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా అందుకే సెప్టెంబర్ 21వ తేదీ కోసం నిరీక్షిస్తున్నారు. దసరా పండగను ఒక వారం ముందే జరుపుకోవడానికి..!
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…