
[m9ad]
ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించామని, ఇద్దరం వేర్వేరు పార్టీలు పెట్టి ప్రత్యర్థులుగా మారినా హుందాగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తాను హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ షూటింగ్ పూనమల్లెలోని ఓ ప్రైవేటు స్టూడియోలో జరుగుతుండగా, అక్కడికి సమీపంలో రజనీకాంత్ ‘కాలా’ సినిమా షూటింగ్ జరుగుతోందని, అప్పుడే వెళ్లి రజనీని కలిశానని కమల్ వెల్లడించారు.
“మనం రహస్యంగా మాట్లాడుకుందామా? అని రజనీని అడిగా. ఇద్దరం కలిసి కారులో కూర్చుని మాట్లాడుకున్నాం. రాజకీయాల్లోకి రావాలనుకున్న నా నిర్ణయాన్ని చెప్పా” అని కమల్ వివరించారు. కమల్ నిర్ణయం విని రజనీకాంత్ ఆశ్చర్యపోయారట. రాజకీయాల్లోకి రావాలని తాను మానసికంగా సిద్ధమయ్యానని రజనీకి కమల్ చెప్పేశారట. అంతేకాదు.. అప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ ప్రకటించడంతో భవిష్యత్తులో ఇద్దరం ప్రత్యర్థులుగా మారినా హుందాగా వ్యవహరించాలని కూడా అప్పుడే నిర్ణయించుకున్నట్టు కమల్ వివరించారు.
Karthik Subbaraj’s Dorothy has found a new audience after its recent Netflix premiere. Despite receiving…
Artificial intelligence is increasingly entering the film industry, but its first BIG theatrical test in…